Dhanteras: ధన త్రయోదశి రోజున వెండి, బంగారం బదులు ఈ ఒక్క వస్తువు కొంటే చాలు.. లక్ష్మిదేవి ఇంట్లో తిష్ట వేయాల్సిందే!
Dhanteras: ధన త్రయోదశి రోజున ఇప్పుడు చెప్పబోయే వస్తువు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభించడంతోపాటు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే వెంటనే తొలగిపోతాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 08:02 AM, Tue - 14 October 25

Dhanteras: ప్రతీఏడాది ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం లోని త్రయోదశి తిథిని ధన త్రయోదశి అని పిలుస్తారు. దీనినే ధనతేరాస్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ సంవత్సరం 2025 అక్టోబర్ 18న ధన్ తేరాస్ ను జరుపుకోనున్నారు. ఈ రోజున ప్రజలు సాధారణంగా బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున చీపురు కొనడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే మరీ ఈరోజున చీపురును ఎందుకు కొనుగోలు చేస్తారు.
చీపురును సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ధన్ తేరస్ నాడు చీపురు కొని ఇంటికి తీసుకుని రావడం అంటే లక్ష్మీ దేవిని ఇంటికి తీసుకువచ్చినట్లే అని చెబుతున్నారు. ఈ రోజున చీపురు కొనడం లక్ష్మీ దేవిని సంతోషపరుస్తుందట. ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈరోజు చీపురు ఇంటిలోని ప్రతికూల శక్తిని,పేదరికాన్ని తొలగిస్తుందట. అందువల్ల ధన్ తేరాస్ నాడు ఇంటికి కొత్త చీపురు తీసుకురావాలని పండితులు చెబుతున్నారు. అలాగే పేదరికం తొలగిపోతుందట.
అంతేకాదు ధన్ తేరాస్ నాడు చీపురు కొనడం వల్ల శ్రేయస్సు వస్తుందని, కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ధన్‌తేరస్ నాడు చీపురు కొని తర్వాత ఆ చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందట. ధన్‌తేరస్ నాడు చీపురు కొనడం పేదరికాన్ని దూరం చేయడానికి ఒక సులభమైన మార్గంగా పరిగణించబడుతుందట. హిందువులు చీపురుని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి లక్ష్మీదేవిని ఇంట్లో ఆహ్వానించడానికి ఆమె ఉనికిని ఇంట్లో ఉంచడానికి ధన్‌తేరస్ నాడు చీపురు కొని దానిని పూజించడం మంచిదని చెబుతున్నారు. అయితే ఇలా ధన్‌తేరస్ నాడు కొనుగోలు చేసిన చీపురును అదే రోజున ఉపయోగించకూడదట. పండగ తర్వాత వచ్చే గురువారం రోజు నుంచి ఈ చీపురుని ఉపయోగించాలని, అంతేకాదు ఎప్పుడూ చీపురుని కాలితో తన్నకూడదని చెబుతున్నారు.