Chilkur Balaji Temple : చిలుకూరుకు పోటెత్తిన భక్తులు 7 కి.మీ మేర ట్రాఫిక్ జాం..
సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదం పంచనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇటీవల ప్రకటించారు
- By Sudheer Published Date - 03:49 PM, Fri - 19 April 24

గరుడ ప్రసాద వితరణపై విస్తృత ప్రచారం నేపథ్యంలో చిలుకూరి ఆలయానికి భక్తులు (Devotees Rush To Chilkur Balaji) పోటెత్తారు. దీంతో కిమీమేర ట్రాఫిక్ జాం నడుస్తుంది. చిలుకూరి బాలాజీ అనగానే చాలామంది వీసా దేవుడు..కోర్కెలు తీర్చే కలియుగదైవం అని ప్రతి ఒక్కరు అంటారు. చిలుకూరి ఆలయంలో ప్రతి ఒక్కరు తమ కోరిక తీరితే 108 సార్లు ప్రదక్షిణలు చేస్తానని కోరుకుంటారు. ఆ కోరిక తీరగానే 108 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. కేవలం తెలుగు రాష్ట్రాల వారే కాదు దేశ వ్యాప్తంగా కూడా భక్తులు చిలుకూరి వచ్చి తమ కోర్కెలు తీర్చుకుంటుంటారు. శని , ఆదివారాల్లో అయితే గుడిలో కాలు పెట్టె సందు ఉండదు. అలాంటి మహిమల గల ఆలయంలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
చిలుకూరి బాలాజీ ఆలయంలో ఏటా వారం పాటు జరిగే జరిగే బ్రహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు వేదపండితులు పుట్టమన్నుతో పూజలకు అంకుర్పారణ చేశారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఇక గరుత్మంతునికి నైవేద్యం సమర్పించారు. అనంతరం సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదం (Garuda Prasadam) పంచనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇటీవల ప్రకటించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో కిలోమీటర్ల పొడువున ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మాసబ్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం, నానల్ నగర్, లంగర్ హౌస్, సన్ సిటీ, అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు ఆలయం వరకూ ట్రాఫిక్ జాం అయ్యింది. గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది. దాదాపు లక్ష మంది వరకూ వాహనాల్లో వెళ్లినట్లు అంచనా వేస్తుండగా.. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ట్రై చేస్తున్నారు. ఉదయం నుండి ఇలాగే ట్రాఫిక్ జామ్ నడుస్తుంది. ఇక గుడి ఆవరణలోకి కాదు కదా..కనీసం చుట్టుపక్కల వరకు కూడా పోలేని పరిస్థితి నెలకొంది. దీనిని బట్టి అర్ధం చేసుకోవాలి చిలుకూరి బాలాజీకి ఎంత మహిమ ఉందొ..భక్తులు ఎంతగా నమ్ముతారో..!!!
Read Also : Rajaiah : నీకు సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ..కడియం కు రాజయ్య సవాల్