Deeparadhana: దీపారాధన విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
మామూలుగా ఇంట్లో నిత్య దీపారాధన చేసే సమయంలో కొంతమందికి దీపారాధన విషయంలో అనేక రకాల సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. చాలామందికి దీపారాధన పద్ధత
- By Anshu Published Date - 08:30 PM, Wed - 14 June 23

మామూలుగా ఇంట్లో నిత్య దీపారాధన చేసే సమయంలో కొంతమందికి దీపారాధన విషయంలో అనేక రకాల సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. చాలామందికి దీపారాధన పద్ధతులు తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. ఇలా దీపారాధన చేసే సమయంలో తెలిసి తెలియక తప్పులు చేయడం వల్ల పూజ ఫలితం దక్కకపోగా కష్టాలను భరించాల్సి ఉంటుంది.. అయితే మరి దీపారాధన ఏ విధంగా చేయాలి? ఆ దీపారాధన పద్ధతులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దీపారాధన చేసే ముందు చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే ముందుగా వత్తి వేసి ఆ తర్వాత నూనెను పోస్తూ ఉంటారు.
కానీ అలా చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసి ఆ తర్వాత వత్తులు వేయాలి. వెండి కుందులు, పంచ లోహ కుందులు, ఇత్తడి కుందులు మంచివి. స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు. అలాగే దీపారాధన చేసే సమయంలో కుందులను రోజూ శుభ్రంగా కడిగిన తర్వాతే ఉయోగించాలి. శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్ధతి కాదు. ఏ ప్రమిదలో దీపారాధన చేసినా ఆ ప్రమిద కింద చిన్న పళ్లేన్ని లేదా ఆకుని ఉంచడం అన్నది తప్పనిసరి. అలాగే
మూడు వత్తులతో దీపారాధన చేయడం వలన సంతాన లాభం కలుగుతుంది.
అయిదు వత్తులతో దీపారాధన చేయడం వలన సంపదలు చేకూరతాయి..తొమ్మిది వత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దీపాన్ని ఎప్పుడు కూడా నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకహారతి వినియోగించాలి. అగరొత్తులు, ఏకహారతి, కర్పూర హారతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దీపారాధన నుంచి వెలిగించకూడదు. ఇక దీపారాధనకు ఆవునెయ్యి శ్రేష్ఠం, అదీకాకపోతే నువ్వుల నూనె, ఇప్పనూనె, కొబ్బరినూనె, కుసుమనూనెతో కూడా చేయవచ్చు.