HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Daiva Puja And Tulasi Puja Niyamalu In Telugu

Pooja: తులసి మొక్క, పూజా మందిరం.. ఈ రెండింటిలో మొదటి పూజ ఎక్కడ చేయాలో మీకు తెలుసా?

సాధారణంగా పూజ చేసే వారికి ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దీపారాధన విషయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు కూడా ఉంటా

  • Author : Anshu Date : 09-01-2024 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Download (1)
Download (1)

సాధారణంగా పూజ చేసే వారికి ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దీపారాధన విషయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు కూడా ఉంటాయి. అటువంటి వాటిలో మొదటి పూజా ఎక్కడ చేయాలి అన్న సందేహం కూడా ఒకటి. అంటే మొదటి పూజ దేవుడి మందిరంలో చెయ్యాలా? లేదంటే కలసి మొక్క దగ్గర చేయాలా అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. అలాగే మొదటి దీపం గడప దగ్గర వెలిగించాలా, లేదంటే మన పూజా మందిరంలోని దేవుని దగ్గర వెలిగించాలా అన్న ఈ సందేహాలకు సరైన సమాధానం తెలియక అనేకమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటి వల్ల మీరు చేసిన ఫలితం దక్కకపోగా దేవుళ్ళ ఆగ్రహానికి లోనవుతూ ఉంటారు.

మాములు రోజులతో పోల్చుకుంటే కార్తీకమాసంలో దీపానికి దీపారాధనకి, దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో దీపోత్సవం చేస్తూ ఉంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దీపాలకి పాపాలను ప్రక్షాళన చేసేటువంటి శక్తి ఉంటుంది అని అర్థం. అంతేకాకుండా మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా దీపం చేస్తుంది. కేవలం సానుకూల శక్తిని మామూలు వేదులతో ప్రవహింప చేసేలా చేస్తుంది. అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు చాలామంది అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు. మీకు ఎంత స్థాయి స్తోమత కలిగి ఉన్నా లేకపోయినా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయటం అనేది చాలా గొప్ప విషయం. దీపారాధన మట్టితో తయారు చేసిన ప్రమిదల్లోనే చేయాలి. అయితే దీపారాధన ఎవరు చేయాలి అన్న విషయానికి వస్తే..

సాధారణంగా ఇంట్లో విధానాలని ఇంట్లో స్త్రీలు పాటిస్తూ ఉంటారు. వాస్తవానికైతే ఇంటి యజమాని ఇంటికి పెద్దదైనటువంటి పురుషుడు పూజా విధానం నిత్యం పాటించాలట. స్త్రీ పురుషుడు ఎవరైనా సరే దీపారాధన కానీ నిత్య పూజలు కాని చేయవచ్చు. ఇక దీపారాధన చేసేటప్పుడు పసుపు రంగు బట్టల్లో దీపారాధన చేస్తే మేలు చేస్తుంది అంటారు. ఇక ఎలాంటి ఒత్తులు వాడాలి. జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే వినాయకుని అనుగ్రహం కలుగుతుంది అంటారు. దుష్ట బాధల నుండి విముక్తి లభిస్తుంది అంటారు ఉపశమనం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక దీపారాధన చేసే సమయం చాలా ముఖ్యమైనది సూర్యోదయ సమయంలో మాత్రమే దీపారాధన చేయాలి. అంటే ఉదయం సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఆ తర్వాత సూర్యాస్తమయం తరువాత అంటే సందెవేళలో చీకటి పడ్డాకే దీపాన్ని వెలిగించాలి. అప్పుడే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉంటారు. ఇక మొదటి పూజ ఎక్కడ చేయాలి.

తులసిని నిత్యం ఆరాధించాలి. ఇక మొదట పూజని తులసి మాత దగ్గర చేయాలా.. లేక మన పూజా మందిరంలో చేయాలనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. తులసి మాత దగ్గర దీపాన్ని పెట్టిన తర్వాత మీరు మీ పూజ గదిలో పూజ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నిత్యం పూజని ఆరాధించే ప్రతి ఒక్కరూ మొదటగా మీరు మీ ఇంటి తులసమ్మకి పూజ చెయ్యాలి. ఆ తర్వాత మీ సింహద్వారాన్ని అలంకరించుకొని పూజ చేయాలి. ఆ తర్వాత మీ ఇంట్లో మీ ఆరాధ్య దైవాన్ని ఆరాధించాలి. మన సింహద్వారం దగ్గర దీపాన్ని వెలిగించిన తర్వాత మన పూజ గదిలో భగవంతుని ఆరాధించాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • first pooja
  • pooja
  • pooja room
  • tulasi mokka

Related News

To get relief from the affliction caused by Saturn, one must offer a specific item to Lord Saneeswara!

Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

మామూలుగా శని దేవుడిని కర్మధాత అని పిలుస్తుంటారు. అంటే మనం చేసే మంచి చెడుల బట్టి ఫలితాలను ఇస్తాడని భక్తులు నమ్ముతుంటారు. మంచి పనులు చేసే వారికి మంచి ఫలితాలను అందించడంతో పాటు ఆయన అనుగ్రహం కలుగుతుందట. చెడు పనులు చేస్తూ, ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడే వారిని ఆయన కష్టాలకు గురి చేస్తాడట. అలా మంచి చెడులను కలిపి ఇస్తూ ఉంటాడు శనీశ్వరుడు. శని దేవుడు జాతకంలో అశుభ స్

  • Simply placing these items in your home's prayer room is enough—you are sure to receive Goddess Lakshmi's blessings!

    Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd