Coconut: కొబ్బరికాయతో ఈ పరిహారాలు చేస్తే చాలు సంపద శ్రేయస్సు కలగడం ఖాయం!
కొబ్బరికాయతో కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే మీకు ఉన్న సమస్యల నుంచి గట్టెక్కవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:30 PM, Sun - 8 September 24

ఆధ్యాత్మిక పరంగా కొబ్బరికాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా పిలుస్తారు. ఆధ్యాత్మిక పరంగా కొబ్బరికాయను ఎన్నో విధాలుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. హిందూ మతంలో, కొబ్బరికాయను సంపద ఫలంగా, దైవం స్వరూపంగా మరియు పవిత్ర ఫలంగా భావిస్తారు. కొబ్బరికాయను రోజువారీ ఆరాధనకు మరియు ఆహారం తయారీకి ఉపయోగిస్తారు. ఇది దైవారాధనను పరిపూర్ణంగా చేస్తుంది. కొబ్బరికాయను గౌరవనీయమైన పూజ్యస్థితిలో ఉంచుతారు. దీనిని దేవునికి అర్పించడం ద్వారా, మన భవిష్యత్తులో చాలా సానుకూల ఫలాలను పొందవచ్చు. కొబ్బరి అనే చిన్న పండు ఆధ్యాత్మికపరంగా మన మనస్సులను ప్రకాశవంతం చేస్తుంది. గొప్ప శక్తితో ఇంటి అభివృద్ధి శ్రేయస్సును పెంచుతుంది. హిందూ మతంలో కొబ్బరికాయను ఉపయోగించకుండా ఏ దేవతను పూజింపరు.
కొబ్బరి కాయలు వెల ఎక్కువగా ఉన్న ప్రదేశంలో వీటి వాడకం తక్కువగా ఉంటుంది. అలాగే కొబ్బరి కొరత ఉన్న ప్రాంతంలో దాని ఉపయోగం తక్కువగా ఉంటుంది. కానీ కొబ్బరికాయ గొప్పతనం ఏమాత్రం తక్కువ కాదు. తరచుగా దేవుళ్లకు పండ్లు అలాగే కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించడం వల్ల 100 కిలోల అన్న ప్రసాదం పెట్టినంత పుణ్యం లభిస్తుందని చెబుతున్నారు. కొందరు దైవశక్తులను కొబ్బరికాయ కలశంలోనికి ఆహ్వానించడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో , ఇంటి చుట్టు ప్రక్కల వాతావరణంలో సానుకూల శక్తి సమతుల్యతను సృష్టిస్తుంది. క్రమం తప్పకుండా దైవారాధనలో కొబ్బరికాయను ఉపయోగించడం ద్వారా మీరు చాలా ఉత్తమ ఫలితాలను పొందవచ్చట. కొబ్బరికాయలు చాలా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయట. మీరు ఏ విషయంలో అయినా న్యాయం కోసం పోరాడుతున్నట్లయితే ఇంట్లో కొబ్బరికాయను ఉపయోగించి పూజ చేయాలని చెబుతున్నారు.
ఇంటి నుండి బయలుదేరిన తర్వాత కొబ్బరిని ఎర్రని పువ్వులతో పూజించాలట. మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆ పువ్వును మీతో తీసుకెళ్లండి. అప్పుడు మీరు ఖచ్చితంగా గెలుస్తారు. సానుకూల శక్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మీ కుటుంబం లేదా మీ మిత్రులపై మీకు చెడు కంటి చూపు ఉంటే, మంగళవారం కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో కట్టుకోవాలి. దృష్టి లోపం ఉన్న వ్యక్తి కోసం బట్టతో చుట్టబడిన కొబ్బరి ముక్కతో ఏడుసార్లు తిప్పి తర్వాత ఆ కొబ్బరికాయను హనుమంతుడి పాదాల వద్ద ఉంచడం వల్ల సమస్యలు నివారించబడుతాయట. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఎటువంటి పనులు మొదలుపెట్టిన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ పడక గదిలో కొబ్బరికాయను ఉంచాలట. తర్వాత రోజు ఉదయం ఆ కొబ్బరికాయను ఇతర పండ్లతో పాటు గణేష్ ఆలయంలో సమర్పించాలని అప్పుడు మీ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయని చెబుతున్నారు.
తరచుగా మీరు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అయితే ఒక ఎర్రని బట్ట కొబ్బరికాయకు చుట్టి, కొన్ని అరటి పువ్వులు కర్పూరం దేవతలకు అర్పించాలట. ఈ విధంగా దేవతారాధన చేస్తే ఈ సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. మీరు పేదరికంతో బాధపడుతున్నట్లయితే శుక్రవారం రోజు కొబ్బరికాయను మహాలక్ష్మి వద్ద ఉంచి ప్రార్థించి ఆ తర్వాత కొబ్బరికాయను లాకర్ లో లేదంటే మీరు డబ్బులు ఉంచే స్థానం దగ్గర ఉంచడం వల్ల నెమ్మదిగా పేదరికం తొలగిపోతుందని చెబుతున్నారు. మీరు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంటే ప్రతి మంగళవారం కొబ్బరికాయ తీసుకొని అంజనేయ ఆలయానికి వెళ్లండి. కొబ్బరికాయపై స్వస్తిక్ గుర్తు రాయడానికి అంజనేయ విగ్రహం వద్ద ఉన్న సింధూరం ఉపయోగించి రాయాలి. తర్వాత అక్కడే కూర్చుని హనుమాన్ చాలీస్ చదవండి.
ఇలా 8 వారాలు క్రమంగా చేస్తే ఆర్థిక సంక్షోభాన్ని తగ్గుతుందట..మీరు వ్యాపారంలో నష్టపోతుంటే ప్రతి గురువారం ఒకటిన్నర మీటర్ల పసుపు వస్త్రాన్ని తీసుకొని, అందులో స్వీట్ తో పాటు కొబ్బరికాయను చుట్టి విష్ణు ఆలయంలో సమర్పించాలట. ఇది మీ సమస్యను తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే శని దేనికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లయితే ప్రతి శనివారం యమునా గంగా ఉన్నది నీటిలో వదలాలని చెబుతున్నారు. అలా నీటిలో వదులుతున్న సమయంలో ఓం రామదూతాయ నమః అనే మంత్రాన్ని జపించాలట. ఈ విధంగా ఏడు సార్లు చేస్తే శని సమస్యలు తొలగిపోతాయని అలాగే హనుమంతుడి ఆశీర్వాదం కూడా లభిస్తుందని చెబుతున్నారు.