Chilkur Balaji Rangarajan : చిలుకూరు బాలాజీ అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి
Chilkur Balaji Rangarajan : రంగరాజన్ తన ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు అనుమతిలేకుండా లోపలికి చొరబడి రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని ఆయనను బెదిరించారు
- By Sudheer Published Date - 06:10 PM, Sun - 9 February 25

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు(Chilkur Balaji Temple’s Chief Priest ) సీఎస్ రంగరాజన్ (C.S. Rangarajan)పై దాడి జరిగింది. రంగరాజన్ తన ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు అనుమతిలేకుండా లోపలికి చొరబడి రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని ఆయనను బెదిరించారు. అయితే దీనికి ఆయన నిరాకరించడంతో దుండగులు ఆగ్రహంతో దాడికి పాల్పడ్డారు. తండ్రిపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు రంగరాజన్ కుమారుడు ప్రయత్నించగా, అతనికూడా గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలయ భక్తుల మధ్య ఆందోళనకు గురిచేసింది. వెంటనే రంగరాజన్, చిలుకూరు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ దాడిని హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అర్చకులపై దాడులు హిందూ ధార్మిక సంస్కృతిని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించాయి. ఘటనకు పాల్పడ్డ వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. చిలుకూరు బాలాజీ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడి అర్చకులు ధార్మిక విలువలను రక్షించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మతపరమైన సామరస్యాన్ని భంగం కలిగించే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ దాడిపై దర్యాప్తు ప్రారంభించారు. రంగరాజన్ కుటుంబానికి భద్రతను పెంచాలని ఆలయ కమిటీ కోరింది. బాధ్యులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని భక్తులు, హిందూ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
Chilkur Priest CS Rangarajan manhandled by individuals claiming Ikshwaku lineage
Dr. Soundararajan, his father, stated that individuals claiming to be Ikshwaku descendants, seeking to establish their version of Rama Rajya with private armies, attacked Rangarajan after he refused… pic.twitter.com/sk09EYZqvP
— Naveena (@TheNaveena) February 9, 2025