Maha Kumbh Mela 2025 : ‘వేప పుల్లల’తో లక్షలు సంపాదిస్తున్న వ్యాపారాలు
Maha Kumbh Mela 2025 : ఈ కుంభమేళాలో వేప పుల్లల వ్యాపారం (Neem sticks Business ) ప్రత్యేక ఆకర్షణగా మారింది
- By Sudheer Published Date - 06:59 AM, Mon - 20 January 25

ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా ఈసారి మహా కుంభమేళా(Maha Kumbh Mela 2025)గా ఏర్పాటైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)వద్ద జనవరి 13న ప్రారంభమైన ఈ పుణ్యసంగమం ఫిబ్రవరి 26న మహా శివరాత్రి నాటికి ముగియనుంది. దేశ విదేశాల నుంచి భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయడానికి తరలివస్తున్నారు. యూపీ ప్రభుత్వం భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచింది.
Ram Charan : దిల్ రాజుకి రామ్ చరణ్ అభయం.. నిజమెంత..?
ఈ కుంభమేళాలో వేప పుల్లల వ్యాపారం (Neem sticks Business ) ప్రత్యేక ఆకర్షణగా మారింది. పూర్వం నుండి దంతశుద్ధి కోసం వేపపుల్లలు ఉపయోగించడం మన సంప్రదాయం. కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా ఉండడంతో, స్థానికులు ఈ సంప్రదాయాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. భక్తులంతా ప్రకృతి ప్రసాదమైన వేప పుల్లలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఒక కట్ట వేప పుల్లలు రూ. 10కి అమ్ముతూ వ్యాపారులు రోజుకు లక్షల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. ఇది పెట్టుబడి తక్కువగా ఉండి, ఎక్కువ ఆదాయాన్ని అందించే వ్యాపారంగా నిలిచింది. ఈ విధంగా 45 రోజులపాటు సాగే కుంభమేళా భక్తులకు ఆధ్యాత్మిక తృప్తి కలిగించడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలను తెచ్చిపెట్టింది.
Bhatti Vikramarka : పదేళ్లు బిఆర్ఎస్ చేయలేని రుణమాఫీని కాంగ్రెస్ చేసింది – భట్టి
వేప చెట్టు ఔషధ గుణాలను మరియు దంత శుద్ధి ప్రాముఖ్యతను తెలియజేస్తూ వ్యాపారులు తాము చేస్తున్న పనిపై గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. భక్తులు కూడా టూత్‌పేస్ట్‌లను మించిన ఉపయుక్తత వేప పుల్లలదేనని నమ్మి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ వ్యాపారానికి గల ఆదరణ కుంభమేళాలో అత్యంత ప్రత్యేకమైనదిగా నిలిచింది. కుంభమేళాకు పాల్గొన్న భక్తుల సంఖ్య 40 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ భారీ సంఖ్యలో భక్తుల రాకతో వేప పుల్లల వ్యాపారం మహా కుంభమేళాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.