Ayodhya : అయోధ్యలో చూడాల్సిన ప్రదేశాలు..
- By Sudheer Published Date - 01:16 PM, Sat - 20 January 24

అయోధ్య (Ayodhya ) ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మొన్నటి వరకు రాముడి జన్మస్థలం అనే మాట్లాడుకునేవాళ్లం..కానీ ఇప్పుడు రాముడి కోసం గొప్ప మందిరం కట్టారని మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మరో రెండు రోజుల్లో అయోధ్య లో రామ మందిరం ప్రారంభం కాబోతుంది. ఈ మహాఘట్టాన్ని చూసేందుకు కోట్లాదిమంది భక్తులు అయోధ్యకు వెళ్తున్నారు. ఇప్పటికే అక్కడికి లక్షలాదిమంది చేరుకొని అక్కడి అందాలను కనులారా వీక్షిస్తున్నారు. రాత్రి పూట లైట్ల వెలుగులో అయోధ్య రామాలయం ఎంతో ఆకర్షణీయంగా దర్శనం ఇస్తోంది. అన్ని మార్బుల్ పిల్లర్లకు రకరకాల పువ్వులతో అలంకరించి, రామభక్తుల్ని అమితమైన పారవశ్యంలోకి తీసుకువెళ్లే రీతిలో ఆలయాన్ని డెకరేట్ చేసారు. ఇక అయోధ్య కు వెళ్తే కేవలం రామ మందిరం మాత్రమే కాదు ఇంకా అక్కడ చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. Shri Ram Janma Bhoomi
2. Hanuman Garhi Mandir
3. Kanak Bhavan Temple
4. Nageshwarnath Temple
5. Raja Mandir
6. Sita Ki Rasoi
7. Sri Maniram das Chavani
8. Swarg Dwar
9. Tulsi Samarak Bhavan Museum
10. Ramkatha Park
11. Mausoleum of Bahu Begum
12. Ammaji Mandir
We’re now on WhatsApp. Click to Join.
అయోధ్యలో సరయూ నది ఒడ్డున ఉన్న ఘాట్లను సందర్శించవచ్చు. అక్కడి నిర్మలమైన వాతావరణం, సుందరమైన దృశ్యాలు ఎంతగానో కట్టిపడేస్తాయి. అలాగే ఆ నదిలో మీరు పడవ ప్రయాణం చేయవచ్చు. తులసి ఉద్యానాన్ని మీరు దర్శించుకోవచ్చు. ఇక్కడ రాయాయణంలో పేర్కొన్న ఉన్న వివిధ మూలికలు లభిస్తాయి. అంతే కాదు అందమైన తోటలో మీరు విహరించవచ్చు. అలాగే కనక భవన్లో జరిగే హారతిని ఎవ్వరు మిస్ కాకండి. బంగారం, వెండితో నిర్మించిన ఈ దేవాలయంలో హారతి సమయం అద్భుతంగా ఉంటుంది. సాంప్రదాయ హస్త కళలు, వస్త్రాలు, రుచికరమైన వంటల కోసం మీరు అయోధ్య బజార్ వెళ్లొచ్చు. నఖాస్ మార్కెట్, టెర్హి బజార్ వంటి మార్కెట్లను మీరు దర్శించవచ్చు. అయోధ్యలో మీరు అనేక రెస్టారెంట్లు తిరగొచ్చు. అక్కడి వంటలు, రుచులను ఆస్వాదించవచ్చు. బెడ్మీ పూరీ, ఛత్, వెజ్ బిర్యానీ, కచోరీ సబ్జీ, బాతీ చోఖా వంటివి ఎంతగానో నచ్చుతాయి. అంతే కాదు అయోధ్యలో కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్, ఘాట్లు అనేక మతపరమైన ప్రదేశాలతో సహా అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఈ టైం లో వెళ్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కానీ కాస్త రెండు , మూడు నెలల తర్వాత అయితే ఎంతో ఫ్రీ గా వీటినిన్నటిని చూసేయొచ్చు. ప్రస్తుతం రామ మందిరం ఓపెనింగ్ సందర్బంగా అన్ని హోటల్స్ , లాడ్జ్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. అంతే కాదు వీటి కాస్ట్ కూడా ఇప్పుడు వేలు దాటియి. అందుకే ఇప్పుడు కాకుండా కొన్ని రోజుల తర్వాత వెళ్తే బాగుంటుంది.
Read Also : Fake Ayodhya Prasadam : అమెజాన్‌లో అయోధ్య ప్రసాదం..వార్నింగ్ ఇచ్చిన కేంద్రం