Black Thread: నల్ల దారాలు ధరిస్తే మంచిదే.. కానీ ఈ రాశుల వారికి మంచిది కాదు..!
మనం తరచుగా మెడ, చేతులు లేదా కాళ్ల చుట్టూ నల్లటి దారం కట్టుకోవడం చూస్తూ ఉంటాం.
- By Gopichand Published Date - 07:30 AM, Mon - 21 November 22

మనం తరచుగా మెడ, చేతులు లేదా కాళ్ల చుట్టూ నల్లటి దారం కట్టుకోవడం చూస్తూ ఉంటాం. అయితే చెడు కన్ను, శని దోషాన్ని నివారించడానికి ప్రజలు నల్ల దారాన్ని కట్టుకుంటారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. నల్ల దారం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఈ నల్ల దారం ధరించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇటివలే పలువురు జోతిష్య శాస్త్ర నిపుణులు ఈ దారం గురించి ఈ విధంగా పేర్కొన్నారు. వీటిని ధరించడం వల్ల మాత్రమే ప్రయోజనాలు చేకూరవని.. వీటిని ధరించడం వల్ల చాలా మంది తీవ్ర నష్టాలకు కూడా గురయ్యారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు.
ప్రయోజనాలు: శని దేవునికి నలుపు రంగు వర్ణాలంటే చాలా ఇష్టం. కాబట్టి నలుపు రంగు వర్ణాలతో పాటు నల్ల దారంను ధరించడం వల్ల మీ జాతకంలో శని గ్రహం బలపడుతుంది. అంతేకాకుండా చెడు కన్ను నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. దుష్ట శక్తుల నుండి రక్షిణ కలుగుతుంది. ముఖ్యంగా శని దోషం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నల్ల దారంను కట్టుకోవాలి.
వీరికి మంచిది కాదు: నల్ల దారం వల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ కొంతమంది దానిని ధరించడం వల్ల తీవ్ర నష్టాలకు దారీ తిసే అవకాశాలున్నాయి. వృశ్చికం, మేష రాశి వారు నల్ల దారం కట్టుకోవద్దని పేర్కొంటున్నారు జోతిష్య శాస్త్ర నిపుణులు. వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. కాబట్టి ఈ గ్రహానికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. వీరు నల్ల దారాన్ని ధరించడం మంచిది కాదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రాశి వారు ఈ నల్ల దారాన్ని కట్టుకోకపోవడమే మంచిదని అంటున్నారు. ఈ రాశి వారు నల్ల దారాన్ని కట్టుకుంటే ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
నలుపు రంగు ధరించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే
– కుడి కాలికి నల్ల దారం కట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
– కేవలం మంగళ, శనివారాల్లోనే నలుపు దారం ధరించాల్సి ఉంటుంది.