Mangla Gauri Vratham : వివాహం ఆలస్యం అవుతుందా..మంగళగౌరీ వ్రతం చేసి చూడండి..!!
శ్రావణమాసంలో ఆచరించాల్సిన వ్రతములలో మొదటిది మంగళగౌరీ వ్రతం. ఈ వ్రతం పెళ్లయిన, పెళ్లికాని ఆడపిల్లలకు శుభ్రప్రదంగా భావిస్తారు.
- By hashtagu Published Date - 07:00 AM, Tue - 12 July 22

శ్రావణమాసంలో ఆచరించాల్సిన వ్రతములలో మొదటిది మంగళగౌరీ వ్రతం. ఈ వ్రతం పెళ్లయిన, పెళ్లికాని ఆడపిల్లలకు శుభ్రప్రదంగా భావిస్తారు. ఈ శ్రావణమాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరీని పూజించాలి. మొదటి మంగళగౌరీ వ్రతం జూలై 19న వస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. మంగళ యోగం వల్ల వివాహానికి ఆటంకాలు లేదా ఆలస్యమవుతున్న వారికి శ్రావణసమాసంలో వచ్చే మంగళగౌరీ వ్రతాన్ని తప్పక పాటించాలి. అంతేకాదు ఈ ఉపవాసం పాటించడం వల్ల వివాహానంతరం భార్యాభర్తల మధ్య సంబంధాల్లో ఏర్పడిన దూరాన్ని కూడా తొలగించవచ్చు. మంగళగౌరీ వ్రతానికి సంబంధించిన పరిహారాలు గురించి తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం…తొలిసారిగా మంగళగౌరీ వ్రతం ప్రారంభించేటప్పుడు పెళ్లికానీ అమ్మాయిలు, వివాహిత స్త్రీలు మంగళవారం నాడు హనుమంతుని పాదాలకు నమస్కరించి తిలకాన్ని తీసి వారి నుదుటిపై పూస్తారు. వ్రతం చేస్తున్నవారు తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. తొలి వాయనాన్ని కూడా తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే..అత్తగానీ లేదా ఇతర ముత్తైదువులు సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాణి పెట్టుకోవాలి.
మంగళగౌరీ వ్రతం ఆచరించే సమయంలో పెళ్లికాని అమ్మాయిలు తప్పనిసరిగా శ్రీమద్ భగవత్ అని 18 సార్లు జపించాలి. గౌరీపూజన్, తులసీరామాయణంలోని సుందరకాండలోని 9వ శ్లోకాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల కుజుడు శుభప్రదుడు అవుతాడు.