Shani Dev: కొబ్బరి కాయతో ఈ పని చేస్తే శని దోషం వదిలి సంపన్నులు అవుతారట!
హిందువులు ఎటువంటి శుభకార్యం తలపెట్టిన కూడా అందులో కొబ్బరికాయను కొట్టి ఆ పనులను ప్రారంభిస్తూ ఉంటారు.
- By Nakshatra Published Date - 03:32 PM, Mon - 26 September 22
హిందువులు ఎటువంటి శుభకార్యం తలపెట్టిన కూడా అందులో కొబ్బరికాయను కొట్టి ఆ పనులను ప్రారంభిస్తూ ఉంటారు. కొబ్బరికాయను కొట్టడం వల్ల శుభసూచకంగా భావించడంతోపాటు ఎటువంటి పనులు అయినా ఆటంకలు లేకుండా పూర్తి అవుతాయి అని భావిస్తూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఈ కొబ్బరికాయకు ముఖ్యస్థానం ఇవ్వబడింది. ఈ కొబ్బరికాయ తో కొన్ని రకాల దోష పరిహారాలు కూడాసూచించబడ్డాయి.
కొబ్బరికాయతో వాటిని పాటించడం వల్ల కష్టానష్టాలు తొలగిపోయి సంపద,సంతోషం కలిగి ఆనందంగా ఉంటారు. మరి అలా సంతోషంగా ఉండటం కోసం కొబ్బరికాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒకవేళ జాతకంలో శని దోషం ఉంటే జీవితం సమస్యల ఊబిలో చిక్కుకున్నట్లే. మరి అటువంటి సమస్యలను నుంచి ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఉండటం కోసం వాటి నుంచి బయట పడాలి అంటే శనివారం రోజు మీ చేతులతో కొబ్బరికాయను నదిలో వేయండి.
ఆ సమయంలో హనుమంతుని ఓం రామదూతాయ నమః అనే మంత్రాన్ని జపించండి. జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కించమని ఆ హనుమంతుడిని ప్రార్థించాలి. అదేవిధంగా తరచు మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతుంటే ఎర్రటి గుడ్డలు టెంకాయను కట్టి గుమ్మం దగ్గర వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల నెగిటివిటీ తొలగించే చేపట్టే పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే వ్యాపారాలలో ఇతర విషయాలలో ఆర్థికంగా నష్టాలను చవిచూస్తున్నట్లయితే గురువారం నాడు కొబ్బరికాయ, పసుపు పువ్వులు, పసుపు ముడి, పసుపు రంగు మిఠాయిలను ఒక పసుపు వస్త్రంలో కట్టి శ్రీ మహావిష్ణువుకు సమర్పించి మనసులోని కోరికను చెప్పుకోవాలి.
Related News
Summer: సమ్మర్ లో అలసటకు గురవుతున్నారా.. కాసిన్ని కొబ్బరి నీళ్లు తాగితే రోజంతా జోష్
Summer: కొబ్బరి నీళ్లలో చాలా పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్, ఎంజైములు, విటమిన్ సి ని కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్ల వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా.. అలసట, బలహీనతను తొలగిస్తుంది. దాంతోపాటు మధుమేహం వంటి వ్యాధులను కూడా అదుపులో ఉంచుతుంది. అయితే ఎండకాలంలో క్రమం తప్పకుండా తీసుకోవడం ఉత్తమం. కొబ్బరి నీళ్లలో తక