Snake: కలలో పాములు పదేపదే కనిపిస్తున్నాయా.. దాని అర్థం ఇదే?
- By Sailaja Reddy Published Date - 10:23 PM, Wed - 13 March 24

మామూలుగా కలలు రావడం అన్నది సహజం. మనకు కలలో అనేక రకాల జంతువులు పక్షులు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అయితే చాలామందికి కొన్ని రకాల కలలు పదేపదే రావడం కలలో జంతువులు పదేపదే కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొందరికి తరచుగా ఆ కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి.. మరి అలా కనిపించడం దేనికి సంకేతం?అలా కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలలో పాములు కనిపించడానికి రాహు, కేతు దశలు లేకుంటే రాహు బుద్ధి, కేతు బుద్ధి కాలంగా వుంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
దీనిని బట్టి పాము కలలో కనిపించేందుకు జ్యోతిష్యానికి తప్పక లింకుందని వారు వివరిస్తున్నారు. పాములు కలలో వస్తే ఒకంతకు మంచిదేనట. రాహు -కేతు గ్రహాలకు పరిహారం చేసేందుకే పాములు అలా కలలో కనిపిస్తాయని వివరిస్తున్నారు. నిద్రలో పాములు కనిపిస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వారి జాతకంలో కాలసర్ప దోషం లేదా రాహు-కేతు దశ నడుస్తున్నట్లు అర్థం. ఇలాంటి వారికి కలలో పాములు కనిపిస్తుంటాయి. కలలో పాముల గుంపు కనిస్తే అలాంటి కల అశుభకరమైనదిగా బావించాలి. ఇలాంటి కల వస్తే జీవితంలో కష్టాలు ఎదురుకానున్నాయని అర్థం.. నాగుపామును కలలో వస్తే విరోధులతో ఇబ్బందులు వస్తాయట.
రెండు తలలతో కూడిన నాగుపాము కలలో కనిపిస్తే మంచి ఫలితాలు ఉంటాయట. అలాగే పామును చంపేస్తున్నట్లు కలగంటే శత్రుబాధలు తొలగిపోతాయి. నాగుపాము కరిచినట్లు కలవస్తే ధనలాభం ఉంటుందట. పాము తరుముతున్నట్లు కలగంటే దారిద్ర్యం తప్పదని చెబుతున్నారు. పాము కాలికి చుట్టుకున్నట్లు కలవస్తే శని పట్టిపీడించబోతున్నాడని గ్రహించాలి. పాము కరిచి రక్తం వచ్చినట్లు కలగంటేపట్టిన శని వీడుతున్నట్లు గుర్తించాలి. పాము గొంతుకు చుట్టినట్లు కలగంటే ఆస్తిపరులు అవుతారని అర్థం. కలలో పామును చంపుతున్నట్లు కనిపిస్తే అలాంటి కల శుభప్రదమట. మీరు మీ శత్రువుపై విజయం సాధించబోతున్నారని సంకేతమట.