HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Ashtalakshmi Stotram Will Help Solve Problems

Ashtalakshmi Stotram: అష్టలక్ష్మీ స్త్రోత్రం చదివితే…అష్టకష్టాలు దూరం అవుతాయా..?

అష్టకష్టాలు అంటే ఎనిమిది రకాల కష్టాలు తీర్చే శక్తి అష్టలక్ష్మీకే ఉందని పండితులు చెబుతారు.

  • By Hashtag U Published Date - 06:30 AM, Wed - 1 June 22
  • daily-hunt
Asthalakshmi Strotram
Asthalakshmi Strotram

అష్టకష్టాలు అంటే ఎనిమిది రకాల కష్టాలు తీర్చే శక్తి అష్టలక్ష్మీకే ఉందని పండితులు చెబుతారు. అష్టలక్ష్మీలు ఎవరు..ఏ లక్ష్మీ ఎలాంటి కష్టం తీరుస్తుంది. ఇఫ్పుడు తెలుసుకుందాం.

1. ఆదిలక్ష్మి:
ఆదిలక్ష్మి..వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువుతీరి ఉంటుంది. లక్ష్మి దేవి చేతిలో కనిపించే కమలం పువ్వు పవిత్రతకు చిహ్నం. ఇందిరాదేవి అని కూడా పూజిస్తారు. ఆది లక్ష్మిని ఆరాధిస్తే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.

2. ధాన్య లక్ష్మి :
ధాన్యం అనగా పండించిన పంట. పంట ఈ రూపంలో ఉన్న అమ్మవారిని పూజించటం వల్ల జీవించేందుకు కావాల్సిన ఆహారానికి ఎలాంటి లోటు ఉండదు. పంటలు సరిగ్గా పండాలన్నా, అతివృష్టి-అనావృష్టి రాకుండా ఉండాలన్నా ధాన్యలక్ష్మీ అనుగ్రహం ఉండాల్సిందే.

3 ధైర్య లక్ష్మి :
సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే వారితో సమస్య ఉండదు. కానీ చిన్న కష్టం రాగానే కుంగిపోయేవారితోనే అసలు సమస్య. ఇలాంటి వారు ధైర్యలక్ష్మీని ప్రార్థించాలి.

4. గజలక్ష్మి:
గజలక్ష్మీ అమ్మవారు…క్షీరసాగర మథనం సమయంలో సముద్రుడి కుమార్తెగా ఉద్భవించింది. రెండు ఏనుగులు అమ్మవారి ప్రక్కన నిలబడి జలధారని వర్షింప చేస్తూంటాయి. ఇక్కడ ఏనుగులను గణపతి స్వరూపంగా భావిస్తుంటారు. లక్ష్మీ గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించటం వల్ల ఇల్లు, వాహనాలు సమకూరుతాయని నమ్మకం.

5. సంతాన లక్ష్మీ:
ఈ అమ్మవారు సంతాన లేమి సమస్య తీరుస్తుంది. కొందరికి పిల్లలు కలిగినప్పటికీ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. సంతాన లక్ష్మిని పూజిస్తే వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతుంటారు.

6. విజయ లక్ష్మీ :
తలపెట్టిన ప్రతి పనిలోనూ, జీవితంలోనూ విజయం సాధించాలంటే విజయలక్ష్మి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తొలగించి విజయాన్ని అందిస్తుంది విజయలక్ష్మి.

7. ధనలక్ష్మి:
ధనలక్ష్మి అంటే సంపద, బంగారం. ఇవి మాత్రమే కాదు ప్రకృతి నుంచి లభించే ప్రతి వస్తువు కూడా ధనలక్ష్మీ అనుగ్రహం ఉండాలి. అంటే పచ్చని చెట్లు, ఫలవంతమైన చెట్లు, సమృద్ధిగా కురిసే వర్షాలు ఇవన్నీ సంపదే కాబట్టి ఈ అమ్మవారి అనుగ్రహం ఉండాల్సిందే.

8. విద్యాలక్ష్మి:
ఆధ్యాత్మికం, భౌతికం ఎందులో ఏ విద్య అయినా అందులో అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే విద్యాలక్ష్మి అమ్మవారి దయ ఉండాల్సిందే.

అష్ట లక్ష్ములని పూజించడం వలన షోడశ ఫలాలు మనకు లభిస్తాయని చెబుతారు. షోడశ అంటే 16…
1 కీర్తి, 2 జ్ఞానం, 3 ధైర్యం.. బలం, 4 విజయం , 5 సత్సంతానం, 6 యుద్ధ నైపుణ్యం, 7 బంగారం ఇతర సంపదలు,
8 సంతోషం, 9 భౌతిక సుఖాలు, 10 తెలివితేటలు, 11 అందం, 12 విద్యాభివృద్ధి, 13 ఉన్నత విలువలు.. ధ్యానం,
14 నీతి నియమాలు, 15 మంచి ఆరోగ్యం, 16 దీర్ఘ ఆయుః

అష్టలక్ష్మీ స్తోత్రం
ఆదిలక్ష్మి
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే |
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 ||

ధాన్యలక్ష్మి
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 ||

ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||

గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||

సంతానలక్ష్మి
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||

విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||

విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||

ధనలక్ష్మి
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ || 8 ||

ఫలశృతి
శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ||

శ్లో|| శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః |
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ashtalakshmi Stotram
  • devotional
  • problems solution

Related News

Lunar Eclipse

Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

గ్రహణం ప్రారంభమైన తర్వాత ఆహారం వండటం, తినడం చేయకూడదు. ఎందుకంటే గ్రహణం సమయంలో ఆహారం కలుషితం అవుతుందని, దానిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నమ్ముతారు.

  • Bathukamma

    Bathukamma: ఈనెల 21 నుంచి బతుకమ్మ సంబరాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ?

  • Chandra Grahanam

    Chandra Grahanam: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజు స‌త్య‌నారాయ‌ణ వ్ర‌తం చేయొచ్చా?

  • Parivartini Ekadashi 2025

    Parivartini Ekadashi 2025: రేపే పరివర్తిని ఏకాదశి వ్రత పారన.. మనం ఏం చేయాలంటే?

Latest News

  • AP : ఏపీలో పీపీపీ ద్వారా కొత్త దిశ..10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం

  • Flop Combination : ప్లాప్ డైరెక్టర్ తో ప్లాప్ హీరో కాంబో..? హిట్ పడేనా..?

  • Attacks by people : నిన్న బంగ్లా, నేడు నేపాల్.. ప్రజలు తలచుకుంటే కూలిపోవడమే !!

  • “Super Six Super Hit” Public Meeting : నేడే ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’

  • Vice President Elections : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd