Asatoma Sadgamaya : మీ జీవితాన్ని మార్చేసే గొప్ప మంత్రం
Asatoma Sadgamaya : జీవితంలో స్థిరత్వం, సానుకూలత..జీవితంలో ఆనందం, సంతృప్తి..
- By Pasha Published Date - 07:46 AM, Wed - 9 August 23

Asatoma Sadgamaya : జీవితంలో స్థిరత్వం, సానుకూలత..
జీవితంలో ఆనందం, సంతృప్తి..
జీవితంలో మనశ్శాంతి, సానుకూల వాతావరణం..
జీవితంలో ఇవన్నీ కావాలంటే ఒక మంత్రాన్ని రోజూ సూర్యోదయానికి ముందు 108 సార్లు చదవాలి..
ఆ మంత్రమే.. “అసతోమా సద్గమయ”!!
జీవితాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు
హిందూ వైదిక సంస్కృతిలో అత్యంత శక్తిమంతమైన సంస్కృత శాంతి మంత్రాలలో ఒకటి.. “అసతోమా సద్గమయ” (Asatoma Sadgamaya)!! ఈ మంత్రంతో వ్యక్తి తన జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ మంత్రం మనకు దైవిక శక్తి అనుగ్రహాన్ని ఇస్తుంది. మన చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మన మనస్సులోని నెగెటివ్ ఆలోచలు తొలగిపోతాయి. మన బలాలు, బలహీనతలను తెలుసుకోవడంలో సహాయపడే సానుకూల శక్తి లభిస్తుంది. ఆనందం, సంతృప్తి ఇచ్చే ఆధ్యాత్మిక మార్గం కనిపిస్తుంది.”అసతోమా సద్గమయ” మంత్రం మన శరీరం, మనస్సులో శక్తిమంతమైన ప్రకంపనలను సృష్టిస్తుంది. ఈ కంపనాలు మన మనస్సులోని ప్రతికూలత, చెడు ఆలోచనలు, ఒత్తిడిని తిప్పికొడతాయి. ఈ మంత్రం మిమ్మల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తుంది. జీవితంలోని వివిధ భయాలను అధిగమించేందుకు దోహదం చేస్తుంది. వ్యక్తి సామాజిక పెరుగుదల, అభివృద్ధికి సహాయపడే సరైన మార్గాన్ని సూచిస్తుంది.
Also read : Nehru Independence Day Speech : మొట్టమొదటి ఆగస్టు 15 వేడుకల్లో చాచా నెహ్రూ ప్రసంగం ఇదిగో
“ఓం అసతోమా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మామ్రతం గమయ
ఓం శాంతిః శాంతిః శాంతిః”
భావం : “ఓ ప్రభూ.. మమ్మల్ని అవాస్తవికత నుంచి వాస్తవికత వైపు, చీకటి నుంచి వెలుగులోకి, మరణం నుంచి అమరత్వం వైపు నడిపించు. అందరికీ శాంతి కలగాలి” అనేది ఈ మంత్రం అర్థం.
Also read : Weight Loss: త్వరగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినాల్సిందే?