Financial Problems: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. అయితే రావి ఆకులతో ఇలా చేయాల్సిందే!
సంపాదించిన డబ్బులు చేతిలో మిగిలినడం లేదా, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా, అయితే రావి ఆకులతో ఇప్పుడు చెప్పబోయే విధంగా ఆ సమస్యలు తగ్గిపోతాయట.
- By Anshu Published Date - 03:00 PM, Mon - 19 May 25

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఆర్థిక ఇబ్బందులు. ఎంత చూసుకొని ఖర్చు పెట్టినా కూడా ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగలడం లేదు అని దిగులు చెందుతూ ఉంటారు. నెల అంతా కష్టపడి పనిచేసిన కూడా ఆ వచ్చిన డబ్బు నిమిషాల వ్యవధిలోనే ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు. సంపాదించిన డబ్బు ఎప్పటికప్పుడు అయిపోతుందని చేతిలో డబ్బులు మిగలడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు.
మీరు కూడా అలా ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే సమస్యల నుంచి బయటపడవచ్చట. అందుకోసం రావి చెట్టును పూజించాలి అని చెబుతున్నారు పండితులు. రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించడమే కాకుండా సకల దేవతలు కూడా ఈ రావి చెట్టులో కొలువై ఉంటారని భావిస్తారు. ఇలా పవిత్రమైన రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల ఎన్నో రకాల దోషాల నుంచి బయటపడటమే కాకుండా ఆర్థిక ఎదుగుదల కూడా ఉంటుందట. గ్రహ దోషాలతో పాటుగా ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్న వారు రావి ఆకులతో కొన్ని పరిహారాలు పాటించాలట.
ఇందుకోసం ముందుగా రావి చెట్టు ఆకులను తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడగాలి. తర్వాత దేవుడి ముందు పరచాలి. వాటిపై ఒక ప్రమిదను పెట్టాలి. అనంతరం అందులో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఇలా రోజూ ఉదయాన్నే రావి ఆకుల మీద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయట. ఈ విధంగా ప్రతిరోజు దీపం వెలిగించడం వల్ల మనం చేపట్టిన పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి అవుతాయట. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా పూర్వ జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. అలాగే కర్మ ఫలితాన్ని కూడా తొలగించుకోవచ్చట. ముఖ్యంగా శాప దోషాలు, ఇతర దోషాలు కూడా తొలగిపోయి సమస్యల సుడిగుండం నుండి బయట పడతారని, అలాగే అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయని చెబుతున్నారు.