Financial Problems: ఆర్థిక సమస్యలతో సుతమతమవుతున్నారా.. అయితే పౌర్ణమి రోజు రాత్రి ఇలా చేయాల్సిందే!
ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు చేతిలో డబ్బులు మిగలడం లేదు అనుకున్న వారు ఇప్పుడు చెప్పినట్టు పౌర్ణమి రోజు రాత్రి కొన్ని పరిహారాలు పాటిస్తే ఈజీగా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చట.
- Author : Anshu
Date : 23-05-2025 - 4:00 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో 8 మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు చేతిలో మిగలక పోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని బాధపడుతూ ఉంటారు. చాలామంది ఆర్థికపరమైన ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటివారు ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం ఎన్నో పూజలు పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు.
అయితే ఇలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఎలాంటి సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలి అంటే ప్రతి పౌర్ణమి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామాలను చదవటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందట. అలాగే ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు.
ఇలా పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు మన దరికి చేరవు అని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజు సూర్యాస్తమయం సమయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలట. అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించి పూజలు చేయాలని చెబుతున్నారు. ఆవు పాలు బెల్లంతో తయారు చేసిన పరమానాన్ని నైవేద్యంగా సమర్పించాలట. అలాగే రాగితో తయారు చేసిన శ్రీ యంత్రాన్ని పూజలో ఉంచుకొని పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుందట. ఇక లక్ష్మి దేవితో పాటు సంపదకు మూలకారకుడైన కుబేరుడిని కూడా పూజించడం ఎంతో మంచిదని చెబుతున్నారు.