Cooking: స్నానం చేయకుండా వంట చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
మామూలుగా మనం ఉదయం నిద్ర లేచిన తర్వాత తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాం. వాటి వల్ల మనం ఆర్థికంగా, హెల్త్ పరంగా ఎన్నో రకాల సమస్య
- By Nakshatra Published Date - 07:30 PM, Tue - 18 July 23
మామూలుగా మనం ఉదయం నిద్ర లేచిన తర్వాత తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాం. వాటి వల్ల మనం ఆర్థికంగా, హెల్త్ పరంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. నిద్ర లేచిన తర్వాత కొన్ని పనులు చేసే ముందు జాగ్రత్తలు పాటించాలి అని చెప్పినా కూడా కొంతమంది అలాగే వ్యవహరిస్తూ లేనిపోని సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు చాలామంది ఉదయం లేచిన వెంటనే నేరుగా వంట గదిలోకి వెళ్లిపోయి వంటలు చేయడం మొదలుపెడుతూ ఉంటారు. కానీ వాస్తు శాస్త్ర నిపుణులు మాత్రం అలా చేయడం మంచిది కాదు అంటున్నారు.
నిద్ర లేచిన వెంటనే స్త్రీలు వంట గదిలోకి వెళ్లకూడదా? వంట చేయకూడదా? ఒకవేళ వంట చేస్తే ఏం జరుగుతుందో దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూర్వం పొయ్యి వెలిగించగానే కర్రలు పెట్టి ముందు ఒక చుక్క నెయ్యి వేసి దేవుడికి నమస్కరించి గిన్నెపెట్టేవారు. మళ్లీ వంట పూర్తైన తర్వాత మరో చుక్క నెయ్యివేసి కొన్ని మెతుకులు అగ్నిహోత్రుడికి సమర్పించేవారు. సాధారణంగా ఆలోచనలు, తీరు, ప్రవర్తనా విధానం అన్నీ తినే భోజనం ఆధారంగానే ఉంటాయని చెబుతారు. ఇందుకు ఉదాహరణ ఏంటంటే.. పండుగ రోజుల్లో ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి వంటచేసి దేవుడికి నివేదించి తింటారు.
మిగిలిన రోజుల్లో ఇంట్లో పనంతా అయ్యాక స్నానం చేస్తారు. పండుగ రోజు తిన్న భోజనం మీలో సానుకూల ఆలోచనలు, దైవత్వాన్ని నింపితే స్నానం చేయకుండా వండిన వంటను తిన్నవారిలో ఆ సున్నితత్వం ఉండదని, శౌచం లేకుండా వండిన వంట తిన్నవారిలో రాక్షస ఆలోచనలే వస్తాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి స్త్రీలు లేచిన వెంటనే వంట గదిలోకి వెళ్లి వంటలు చేయకుండా నిద్ర లేచిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఆ తర్వాత వంట గదిలోకి వంటలు చేయడం ప్రారంభించాలి.
Related News
Cooking: వాడిన నూనెతో మళ్లీ వంట చేస్తున్నారా.. అయితే మీకు ఈ అనారోగ్య సమస్యలు రావడం ఖాయం
Cooking: చాలామంది నూనెను ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగిస్తారు. ముఖ్యంగా మనం పకోడాలు లేదా సమోసాలు వంటి డీప్-ఫ్రైడ్ వస్తువులను తయారు చేసినప్పుడు. అయితే పదే పదే నూనె వేడి చేసి అందులో ఆహారాన్ని వండుకుంటే అది మన ఆరోగ్యానికి చాలా హానికరం అని మీకు తెలుసా? మనం మళ్లీ మళ్లీ నూనెను వేడి చేసినప్పుడు, దాని నుండి మన ఆరోగ్యానికి ప్రమాదకరమైన కొన్ని హానికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. మనం �