Amavasya: అమావాస్య రోజు పొరపాటున కూడా ఇలా అస్సలు చేయకండి.. చేసారో అంతే సంగతులు!
అమావాస్య రోజు తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల పొరపాట్లు అసలు చేయకూడదని, దానివల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:32 AM, Sat - 4 January 25

అమావాస్య రోజు కొన్ని రకాల పనులు అసలు చేయకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అలా చేస్తే చాలా రకాల కష్టాలను ఎదురుకోవాల్సి అనుభవించాల్సి ఉంటుందట. అమావాస్యను శూన్య తిధిగా పరిగణిస్తారు. అమవాస్య రోజు సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేవాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా పొద్దేక్కే వరకు పడుకోకూడదు. మిగితా రోజులు ఎప్పుడు నిద్రలేచినా సరిపోతుంది కానీ అమావాస్య రోజు మాత్రం కచ్ఛితంగా సూర్యోదయాని కంటే ముందుగానే నిద్రలేవాలి. అలాగే అమావాస్య రోజు తలకు నూను కూడా పెట్టుకోకూడదు. మహిళలకు కూడా ఈ నియమం వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇంట్లో ఆడవారని మాత్రమే కాకుండా ఇంటిల్ల పాది అమవాస్య రోజున తలస్నానం చేయాలి.
అమావాస్య ఏ రోజున వచ్చిందనే దానితో సంబంధం లేకుండా తల స్నానం చేయాలి. తలస్నానం చేసిన తరువాత లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం. ఈ మంత్రాన్ని.. “లక్ష్మీం క్షీరసముద్రరాజు తనయామ్ శ్రీరంగదామేశ్వరం దాసి భౌత సమస్త దేవ వనిత లోకైక దీపం శ్రీమన్మంద కటాక్ష లబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ స్వామి వందే ముకుంద ప్రియా”.. అనే ఈ శ్లోకాన్ని చదువుతూ లక్ష్మీదేవికి పూజ చేసి ఒక తామర పువ్వును సమర్పించాలి. అప్పుడు లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట. అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజ చేయకపోతే దరిద్రమని శాస్త్రంతో పాటు పండితులు చెబుతున్నారు. అమవాస్య రోజు కొత్తబట్టలు కొనుగోలు చేయకూడదు అలా కొనుగోలు చేసిన కొత్త బట్టలు ఎలా ధరించకూడదు. పిల్లలకు పుట్టిన రోజు అయినా సరే పిల్లలకు అమావాస్య రోజున కొత్త బట్టలు అస్సలు కొనరాదు.
తప్పక కొనాలని అనుకుంటే పుట్టిన రోజుకు ఒక రోజు మందుగానైనా కొని పెట్టుకొని ఒకసారి వేసుకొని విప్పి, కొంత పసుపు రాసి తరువాత అమావాస్య రోజున ఆ కొత్త బట్టలను వేసుకోవచ్చు. అమావాస్య రోజున హెయిర్ కటింగ్ కూడా చేయించుకోకూడదట. కనీసం గడ్డం కూడా చేసుకోవడానికి వీలు లేదని పండితులు చెబుతున్నారు. గోళ్లను కూడా కత్తిరించుకోవద్దని అంటున్నారు. అమావాస్య రోజున గోర్లు కత్తిరించి బయట వేసినా లేదా జుట్టు కత్తిరించి బయట వేసినా అది మన శత్రువులకు చిక్కితే దానితో చేతబడి చేసే అవకాశం వుందట. అందుకే పెద్దలు మనకు ఎన్నో ఏళ్ల నుంచి అమావాస్య రోజు గోళ్లు కత్తిరించుకోవద్దు, హెయిర్ కటింగ్ చేసుకోవద్దని చెబుతూ వస్తున్నారు. అమావాస్య ఈ రోజున పెద్దలకు ప్రత్యేకంగా ప్రసాదాన్ని చేసి పెట్టాలి. పెద్దలు కాకుల రూపంలో వచ్చి దాన్ని ఆరగిస్తారని నమ్మకం.
ఇలా అమావాస్య రోజున చేయడం వల్ల పెద్దల ఆశీర్వాదం, అనుగ్రహం కలుగుతుందట. ఇదంగా చేసిన తరువాత కాళ్లు, చేతులు కడుక్కొని తలపై కొన్ని నీళ్లు పోసుకోవాలి. అమావాస్య రోజు ఎవ్వరికీ డబ్బు ఇవ్వకూడదు. అలాగే ఎంతటి దగ్గరివారైనా సరే అప్పు ఇవ్వకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో డబ్బు ఇవ్వాల్సి వస్తే అంతకు ముందు రోజు కానీ ఆ తర్వాత రోజు గాని ఇవ్వవచ్చు. చాలా అత్యవసర పరిస్థితులు అయితే లక్ష్మీదేవిని వేడుకుని మరి ఆ డబ్బులు ఇవ్వాలి. అమావాస్య రోజున మధ్యాహ్నం సాయంత్ర వేళలో నిద్రించకూడదు. ఆ రోజు స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. అమావాస్య రోజు దీపం వెలిగిస్తే కచ్ఛితంగా లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందట. పౌర్ణమి రోజున దీపం వెలిగించడం కంటే అమావాస్య రోజున దీపం వెలిగించడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.