Worlds Largest Lock-Ayodhya : 400 కిలోల తాళం.. అయోధ్య రామ మందిరానికి గిఫ్టుగా ఇవ్వనున్న కళాకారుడు
Worlds Largest Lock-Ayodhya : 10 అడుగుల ఎత్తు.. 4.5 అడుగుల వెడల్పు.. 9.5 అంగుళాల మందంతో 4 అడుగుల సైజున్న తాళం రెడీ అయింది..
- By Pasha Published Date - 08:27 AM, Mon - 7 August 23

Worlds Largest Lock-Ayodhya : 10 అడుగుల ఎత్తు.. 4.5 అడుగుల వెడల్పు.. 9.5 అంగుళాల మందంతో 4 అడుగుల సైజున్న తాళం రెడీ అయింది..
ఈ తాళం బరువు 400 కిలోలు..
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తాళంగా నిలుస్తుందని చెబుతున్నారు..
ఇంతపెద్ద తాళాన్ని ఎందుకోసం తయారు చేశారు ? ఎవరు తయారు చేశారు ?
Also read : Pope Francis-LGBT People : స్వలింగ సంపర్కులకూ చర్చి తలుపులు తెరిచే ఉన్నాయ్.. కానీ : పోప్ ఫ్రాన్సిస్
ఉత్తరప్రదేశ్ లోని తాళాల నగరం అలీగఢ్. ఆ నగరానికి చెందిన సత్యప్రకాశ్ శర్మ గొప్ప హస్తకళాకారుడు. ఆయన రామభక్తుడు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి గిఫ్ట్ గా ఇచ్చేటందుకు 400 కేజీల బరువైన తాళాన్ని ఆయనే తయారు చేశారు. సత్యప్రకాశ్ శర్మ కుటుంబం గత 100 సంవత్సరాలుగా తాళాల తయారీ పనులే చేస్తోంది. ఆయన కొన్ని నెలలపాటు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్దదైన తాళాన్ని రెడీ చేశారు. దీన్ని త్వరలోనే అయోధ్యలో రామాలయ అధికారులకు అందజేస్తానని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో అలీగఢ్ లో నిర్వహించిన ఎగ్జిబిషన్ లో ఈ తాళాన్ని(Worlds Largest Lock-Ayodhya) ప్రదర్శన కు ఉంచారు. ప్రస్తుతం శర్మ ఈ తాళానికి కొన్ని మార్పులు, అలంకరణలు చేస్తున్నారు. తాళం తయారీలో తన భార్య రుక్మిణి ఎంతగానో సహకరించిందని, తయారీకి మొత్తం రూ.2 లక్షలు ఖర్చయిందని సత్యప్రకాశ్ శర్మ వివరించారు.