Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజున ఇలా చేస్తే బంగారం కొన్నదానికన్నా రెట్టింపు ఫలితం దక్కుతుందట.. ఏం చేయాలంటే?
అక్షయ తృతీయ పండుగ రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే బంగారం కొనడానికి అన్న రెట్టింపు ఫలితం దక్కుతుందని చెబుతున్నారు పండితులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:35 PM, Fri - 25 April 25

హిందూ సంప్రదాయం ప్రకారం అక్షయ తృతీయ శుభకరమైన రోజుగా పరిగణించాలి. ప్రతి ఏడాది ఈ అక్షయ తృతీయను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున తప్పకుండా బంగారంని కొనుగోలు చేస్తూ ఉంటారు. కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి నమ్మకం. ఇకపోతే ఈ ఏడాది అనగా 2025 లో ఏప్రిల్ 30వ తేదీన ఈ పండుగను జరుపుకోనున్నారు. వైశాఖ మాసంలో శుక్ల పక్ష తృతీయ తిథి నాడు వచ్చే ఈ రోజు, శాశ్వతమైన ఫలితాలను ఇచ్చే పనులకు అనువైనదిగా నమ్ముతారు. అక్షయ అనే పదం ఎన్నటికీ క్షీణించనిది అని అర్థం.
కాబట్టి ఈ రోజు చేసే శుభ కార్యాలు, కొనుగోళ్లు, పెట్టుబడులు శాశ్వత విజయాన్ని సంపదను తెస్తాయని నమ్మకం. అలాగే ఈ రోజు బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం సాంప్రదాయంగా జరుగుతుంది. ఈరోజు బంగారు కొనుగోలు చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. బంగారంతో పాటు, అక్షయ తృతీయ రోజు వెండి, ఆస్తులు, ఇతర విలువైన వస్తువులను కొనడం కూడా శుభకరంగా భావిస్తారు. కొత్త ఇల్లు, వాహనం, లేదా భూమిని కొనుగోలు చేయడం ఈ రోజు సాధారణం, ఎందుకంటే ఈ కొనుగోళ్లు దీర్ఘకాలిక శ్రేయస్సును తెస్తాయని నమ్ముతారు.
అదనంగా, కొత్త వ్యాపారాలను ప్రారంభించడం, పెట్టుబడులు పెట్టడం, లేదా ఆర్థిక పథకాలలో చేరడం కూడా ఈ రోజు జరుగుతుందట. ఈ రోజు చేసే ఏ చిన్న కొనుగోలైనా శాశ్వత ఫలితాలను ఇస్తుందనే విశ్వాసం ఈ ఆచారాలకు బలం చేకూరుస్తుందట. ఈ రోజు లక్ష్మీ, విష్ణు దేవతలను పూజించడం మంచిది. ఇది సంపద శ్రేయస్సును పెంచుతుందట. ఈ రోజు శుభ ముహూర్తం అవసరం లేని ‘
అబూజ్ ముహూర్త రోజుగా పరిగణించబడుతుంది. కాబట్టి వివాహాలు, గృహ ప్రవేశాలు ఇతర శుభ కార్యాలు ఈ రోజు జరుపుకోవడం సాధారణం. దానం చేయడం, పుణ్య కార్యాలలో పాల్గొనడం, పేదలకు సహాయం చేయడం కూడా ఈ రోజు ప్రత్యేకంగా చేస్తారు. ఇవి శాశ్వతమైన పుణ్య ఫలితాలను ఇస్తాయని నమ్మకం.