HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Akshaya Tritiya 2025 What Things Are Auspicious To Buy According To Zodiac Sign

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున ఏ రాశుల వారు ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయాలో మీకు తెలుసా?

ఈ ఏడాది రాబోతున్న అక్షయ తృతీయ పండుగ రోజున ఏ ఏ రాశుల వారు ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయాలో, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 24-04-2025 - 10:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Akshaya Tritiya
Akshaya Tritiya

ఈ ఏడాది అనగా 2025లో ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి ఏప్రిల్ 29 సాయంత్రం 5:29 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం, అక్షయ తృతీయను 2025 ఏప్రిల్ 30న జరుపుకుంటారు. అయితే ఈ అక్షయ తృతీయ రోజున రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక వస్తువులను కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందట. ఈ రోజున కొనుగోలు చేసిన వస్తువులు ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తాయని నమ్మకం. అయితే మరి రాశి ప్రకారం అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొనడం శుభప్రదమో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇకపోతే అక్షయ తృతీయ రోజున ఏ రాశి వారు ఏ వస్తువులను కొనుగోలు చేయాలి అన్న విషయానికి వస్తే..

మేష రాశి.. ఈ రాశి వారు బంగారం కొనడం శుభప్రదం అని చెబుతున్నారు. వీరు బంగారు ఉంగరం లేదా ఏదైనా చిన్న ఆభరణాలను కొనుగోలు చేయవచ్చట

ఇకపోతే వృషభ రాశి అధిపతి శుక్రుడు. వెండి శుక్రుడికి సంబంధించినది. అందువల్ల ఈ రాశి వారు వెండి ఆభరణాలు, నాణేలు కొనడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు.

మిథున రాశి వారు బంగారు గొలుసు లేదా చెవిపోగులు కొనడం ప్రయోజనకరంగా ఉంటుందట.

కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు వెండికి సంబంధించినవాడు. కాబట్టి ఈ రాశి వారు ఏదైనా వెండి వస్తువులను కొనుగోలు చేయడం మంచిది.

అదేవిధంగా సింహ రాశి వారు బంగారం కొనడం చాలా శుభప్రదం. ఈ రాశి వారు బంగారు లాకెట్ లేదా గొలుసు కొనవచ్చట.

కన్య రాశి వారికి, బంగారు గాజులు, ముక్కు పుడక లేదా ఉంగరం కొనడం వల్ల కెరీర్‌ లో విజయం సాధించవచ్చట. కాబట్టి ఈ రాశి వారు బంగారు కొనుగోలు చేయడం మంచిది.

తుల రాశి వారు వెండి పట్టీలు కొని లక్ష్మీ దేవికి సమర్పించి ధరించాలట. ఇది వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని, మానసిక శాంతిని కాపాడుతుందనీ పండితులు చెబుతున్నారు.

వృశ్చిక రాశి రాశి వారు బంగారు ముక్కు పుడక లేదా ఉంగరం కొనడం శుభప్రదం అని చెప్తున్నారు. అయితే ఈ రాశి అధిపతి కుజుడు కనుక పరిమిత పరిమాణంలో బంగారాన్ని ఉపయోగించడం మంచిదట.

ఇక ధనుస్సు రాశి వారికి బంగారం ధరించడం చాలా ప్రయోజనకరం అని చెబుతున్నారు. మీరు బంగారు గొలుసు, పాపిడి బొట్టు లేదా ఏదైనా ఇతర ఆభరణాలను కొనుగోలు చేయవచ్చట.

మకర రాశి, కుంభ రాశి.. ఈ రెండు రాశుల అధిపతి శనిశ్వరుడు. కాబట్టి వెండికి సంబంధించినది. కనుక ఈ రాశుకి సంబంధించిన వ్యక్తులు వెండి ఆభరణాలు లేదా కాళ్ళ పట్టీలు కొనడం శుభప్రదం అని చెబుతున్నారు.

మీన రాశి అధిపతి బృహస్పతి. బంగారం బృహస్పతికి సంబంధించినది. కనుక ఈ రాశి వ్యక్తులు గాజులు, నెక్లెస్ లేదా చెవిపోగులు వంటి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం శుభప్రదం…


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akshaya Tritiya
  • Akshaya Tritiya 2025
  • gold
  • silver

Related News

Silver Price

శుభ‌వార్త‌.. వెండి ధరల్లో భారీ పతనం!

వెండితో పాటు బంగారం ధరలు కూడా రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. MCXలో ఫిబ్రవరి 2026 డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్ 0.26% పెరిగి రూ. 1,40,230 (10 గ్రాములు) వద్ద ట్రేడ్ అయింది.

  • Silver Price

    వెండి వెలుగులు..పెరుగుదలకు ప్రధాన కారణం ఇదేనా..!

  • Silver Price

    ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర , కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వెనుకాడు

Latest News

  • డిసెంబర్ 31లోపు మ‌నం పూర్తి చేయాల్సిన ముఖ్య‌మైన‌ పనులు ఇవే!

  • టీమిండియా టీ20 జ‌ట్టుకు కాబోయే కెప్టెన్ ఇత‌నే!

  • పాలు తాగడం అందరికీ మంచిది కాదా? డాక్టర్ల కొత్త హెచ్చరిక!

  • మహిళల దుస్తులపై వివాదం.. గుడి దగ్గర వైరల్ గా మారిన పోస్టర్

  • బిగ్ బాష్ లీగ్‌లో భారత సంతతి ఆటగాడు జేసరిస్ వాడియా మెరుపులు!

Trending News

    • మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్.. 2025లో విజయాలు, భారత్ గర్వించదగ్గ క్షణాలీవే!

    • పీఎం కిసాన్ పథకం.. ఒకే కుటుంబంలో ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది?

    • జనవరి 2026 నుండి మారనున్న 10 కీలక నిబంధనలీవే!

    • గౌతమ్ గంభీర్ ఉద్వాసనపై బీసీసీఐ స్పష్టత.. ఆ వార్తల్లో నిజం లేదు!

    • మీ క్రెడిట్ కార్డ్ వాడకం మీ లోన్ అర్హతను దెబ్బతీస్తోందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd