Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఇవి కొనుగోలు చేస్తే చాలు.. బంగారం కొనుగోలు చేసిన దానితో సమానం!
అక్షయ తృతీయ పండుగ రోజు బంగారు కొనుగోలు చేయలేకపోతున్నాం అని బాధపడే వారు ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల వస్తువులను కొనుగోలు చేసిన చాలని బంగారు కోలుగోలు చేసిన ఫలితం దక్కుతుందని చెబుతున్నారు పండితులు..
- By Anshu Published Date - 10:03 AM, Mon - 21 April 25

ప్రతి ఏడాది వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్షంలోని మూడవ రోజును అక్షయ తృతీయ అని అంటారు. ఈ రోజున చేసే ఏ శుభ కార్యమైనా శాశ్వత ఫలితాలను ఇస్తుందని భక్తుల నమ్ముతారు. అందుకే దీనిని అక్షయ తృతీయ అని పిలుస్తారు. పన్నెండు నెలల్లో ప్రతి శుక్ల పక్ష తృతీయ శుభప్రదమైనదని కూడా నమ్ముతారు. అయితే వైశాఖ మాసంలోని తృతీయను అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు. ఈరోజున ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టినా కూడా చాలా మంచిది అని నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా అక్షయ తృతీయ అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది బంగారు. ఈ అక్షయ తృతీయ పండుగ రోజు బంగారు షాపులు అన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని పరిస్థితుల కారణంగా బంగారు కొనుగోలు చేయలేని వారు కూడా ఉంటారు. మరి అలాంటివారు ఏం చేయాలో ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే బంగారం తో సమానము ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తృతీయ రోజు ఇంటికి తీసుకురావాల్సిన మొదటి వస్తువులలో పత్తి కూడా ఒకటి. ఈరోజున పత్తిని కొనుగోలు చేయడం చాలా మంచిదని చెబుతున్నారు. ఇది వ్యాపారాన్ని పెంచుతుందట. వ్యాపారంలో మంచి లాభాలను చూడవచ్చని చెబుతున్నారు.
అక్షయ తృతీయ రోజు ఇంటికి తీసుకు రావాల్సిన వాటిలో ఉప్పు కూడా ఒకటి. ఈ రోజున ఉప్పు ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. అయితే ఈ రోజు కొనుగోలు చేసిన రాతి ఉప్పును తినకూడదని చెబుతున్నారు.
అక్షయ తృతీయ రోజు ఇంటికి తీసుకురావాల్సిన వాటిలో మూడవది మట్టి పాత్రలు. ఈ రోజున మీరు కుండ, గిన్నె, ప్రమిద ఇలా ఎటువంటి మట్టితో చేసిన మట్టి పాత్రలను కొనుగోలు చేయడం వల్ల అనేక మంచి ప్రయోజనాలు కలుగుతాయి. బంగారం కొనలేని వారు మట్టి కుండలను కొనడం కూడా బంగారం కొన్నట్లే పరిగణించబడుతుందట.
అలాగే ఈ రోజున కొనుగోలు చేయాల్సిన వాటీలో బార్లీ లేదా పసుపు ఆవాలు కూడా ఒకటి. బార్లీ లేదా పసుపు ఆవాలు కొనడం బంగారం, వెండి వంటి లోహాలను కొన్నంత ప్రయోజనకరంగా ఉంటుందట.
అక్షయ తృతీయ రోజున గవ్వలను కొనడం చాలా శుభప్రదం అని చెప్పాలి. లక్ష్మీ దేవి కూడా గవ్వలతో పాటు మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు. ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలను అంటే చాలా ఇష్టం. ఈ రోజున 11 గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీ దేవికి సమర్పించాలట. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడూ కొరత ఉండదని నమ్మకం.