Tirumala : శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను అందజేసిన జనసేన మహిళా నేత
Tirumala : తిరుమల శ్రీవారికి డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం భారీ కానుకగా అందించారు. రెండు కోట్ల విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను డీకే ఆదికేశవులు నాయుడు కుమార్తె తేజస్వి, మనవరాలు చైతన్య టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతుల చేతుల మీదుగా అందించారు
- By Sudheer Published Date - 11:44 AM, Thu - 14 November 24

తిరుమల శ్రీవారి (Tirumala Srivari)కి నిత్యం భక్తులు కానుకలు అందజేస్తూ వారి భక్తిని చాటుకుంటారు. ప్రతి రోజు లక్షల మంది శ్రీవారిని దర్శించుకొని , హుండీలలో నగదు , బంగారం వేస్తూ మొక్కులు చెల్లిస్తారు. ఇలా ప్రతి రోజు కోట్లలలో తిరుమల ఆదాయం వస్తూ ఉంటుంది. తాజాగా జనసేన మహిళా నేత ఏకంగా రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను కానుకగా అందజేసి తమ భక్తిని చాటుకుంది.
తిరుమల శ్రీవారికి డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం (DK Adikesavlu Naidu family) భారీ కానుకగా అందించారు. రెండు కోట్ల విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను (Golden victory garland) డీకే ఆదికేశవులు నాయుడు కుమార్తె తేజస్వి (Tejaswi), మనవరాలు చైతన్య టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతుల చేతుల మీదుగా అందించారు. ఈ మాలలను తిరుమల శ్రీవారికి, అలాగే తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి కూడా కానుకగా అందజేయనున్నారు.
డీకే ఆదికేశవులు నాయుడు.. 2004లో టీడీపీ నుండి చిత్తూరు ఎంపీగా గెలిచారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2013లో ఆయన మరణించగానే, ఆయన సతీమణి సత్యప్రభ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి విజయవంతంగా పోటీచేసి గెలిచారు. అయితే, ఆమె 2020లో అనారోగ్యంతో మరణించారు.
డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్ కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించారు, కానీ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఆమె జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేయాలనీ భావించినప్పటికీ కుదరలేదు.
Read Also : Aravind Kejriwal: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అరవింద్ కేజ్రీవాల్