Vasthu Sastra: ఈ వస్తువులను పొరపాటున కూడా ఇతరులకు అస్సలు ఇవ్వకండి.. ఇచ్చారో అంతే సంగతులు!
తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల వస్తువులను ఇతరులకు అసలు ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు.
- By Nakshatra Published Date - 02:00 PM, Tue - 3 September 24
మామూలుగా మనకు ఇరుగుపొరుగువారు ఉప్పు పప్పు నుంచి ఖరీదైన ఆభరణాల వరకు ప్రతి ఒక్కటి కూడా అడుగుతూ ఉంటారు. బాగా కలిసికట్టుగా ఉన్నవారు అయితే ఇచ్చి పుచ్చుకోవడం అన్నది కామన్. కొంతమంది వచ్చిన బంధువుల ముందు బాగా కనిపించడం కోసం మన ఇంట్లోనే విలువైన ఆభరణాలను పట్టుచీరలను కొత్తబట్టలను అడిగిమరీ తీసుకుని వెళుతూ ఉంటారు. అలాగే కొన్ని కొన్ని సార్లు వాహనాలను కూడా అడుగుతూ ఉంటారు. చాలామంది కాదనలేక తీసుకొని వెళ్ళమని చెబుతూ ఉంటారు. కాగా వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇతరులకు అస్సలు ఇవ్వకూడదట. కేవలం ఇవ్వడం మాత్రమే కాదు అంటే మీరు తీసుకోవడం వల్ల కూడా ఏరికోరి మరి దురదృష్టాన్ని తెచ్చుకున్నట్టే అవుతుందని పండితులు చెబుతున్నారు.
మరి ఎలాంటి వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్ర ప్రకారం ఎప్పుడూ కూడా మనం వేసుకునే బట్టలను ఇతరులకు ఇవ్వకూడదట. ఇలా చేయడం వల్ల వారి ప్రతికూల శక్తి మనకు వచ్చేస్తుందని చెబుతున్నారు. అలాగే మీరు ఏవైనా ముఖ్యమైన పనుల నిమిత్తం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పొరపాటున కూడా ఇతరుల బట్టలను వేసుకోకూడదట. అలా చేస్తే మీరు వెళ్లిని పని ఆగిపోయే అవకాశం ఉందట. అంతేకాదు మీకు మానసిక ఒత్తిడి కూడా పోతుందని చెబుతున్నారు. మామూలుగా మనం ఏదైనా బ్యాంకు కార్యకలాపాలకు కానీ ఏదైనా వర్క్ మీద బయటకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు పెన్ అవసరం ఉంటే ఇతరులతో అడిగి తీసుకుంటూ ఉంటారు. ఇతరులకు ఇస్తూ ఉంటారు.
అయితే పని పూర్తయిన తర్వాత వారికి ఇవ్వడం మరిచిపోయి అలాగే వారి దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. కానీ మనం ఎవరిదైనా పెన్ను తీసుకుంటే తప్పనిసరిగా వారికి తిరిగి ఇవ్వాలట. లేకపోతే ఇది మీ జీవితంలో ఎన్నో సమస్యలకు దారి తీసే అవకాశం ఉందట. అంతేకాదు మీరు ఎందులో అయినా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం కూడా వస్తుందట. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇతరుల పెన్ను తీసుకుంటే లేదా తీసుకోవాల్సి వచ్చినా, మీ పని పూర్తయిన వెంటనే దాన్ని తిరిగి ఇచ్చేయాలని చెబుతున్నారు. అలాగే మనం ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు లేదా స్నేహితులు, ఇంకెవరైనా ఇంటికి వెళ్లినప్పుడు మనం పొరపాటున కూడా వారి ఇంట్లోని పడకగదిలో పడుకోకూడదట. ఇలా చేస్తే వాస్తు దోషం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని కారణంగా మీ వ్యక్తిగత జీవితంలో అనేక దుష్ప్రభావాలు కలుగుతాయట. అలాగే ఆర్థిక సమస్యలు కూడా విపరీతంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇదొక్కటే కాదండోయ్ మీరు ఏవైనా అప్పులు తీసుకుంటే, తీసుకున్న వారి నుండి వెంటనే చెల్లించమని ఒత్తిడి కూడా పెరుగుతుంది. దీంతో మీరు ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయే అవకాశం ఉంటుంది. దీని గురించి అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి మీరు ఇతరుల పడకగదిని ఎప్పటికీ వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు.
అలాగే మీరు ఎట్టి పరిస్థితులలో ఇతరుల నుంచి శంఖాన్ని తీసుకోవడం లేదు ఇవ్వడం లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే వాస్తు శాస్త్ర ప్రకారం శంఖం లక్ష్మీదేవి సంకేతంగా చెబుతారు. దీన్ని మీరు ఇతరులకు ఇచ్చినట్లయితే మీ ఆస్తి కూడా చాలా వేగంగా కరిగిపోయే అవకాశం ఉంటుదట. అంతేకాదు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై పేదరికంలో కూరుకుపోతారని చెబుతున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని ఇచ్చినట్లయితే, వారి దగ్గర నుండి దాన్ని తిరిగి తీసుకోవాలి. ఆ తర్వాత దాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాత మాత్రమే వాడాలి. లేకపోతే మీ జీవితంలో అనేక సమస్యలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Tags
Related News
Vathu Tips: సంపదకు లోటు ఉండకూడదంటే ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండాల్సిందే!
వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని రకాల వస్తువులు పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు.