Vastu Tips: మీ ఇంట్లో ఇలాంటి పాత వస్తువులు ఉన్నాయా.. అయితే వెంటనే పారేయండి?
చాలామంది ఇంటిలో ఒకప్పటి వస్తువులను జ్ఞాపకాలుగా పెట్టుకుంటూ ఉంటారు. వాటిని భవిష్యత్తులో చూసుకొని ఆ
- By Nakshatra Published Date - 06:30 AM, Fri - 15 July 22
చాలామంది ఇంటిలో ఒకప్పటి వస్తువులను జ్ఞాపకాలుగా పెట్టుకుంటూ ఉంటారు. వాటిని భవిష్యత్తులో చూసుకొని ఆ జ్ఞాపకాలను మరొకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది అని వస్తువులను అలాగే పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఆ పాత వస్తువులతో జ్ఞాపకాల సంగతి పక్కన పెడితే వాస్తు శాస్త్రం ప్రకారం రాహు, కేతువులు, శని,ఎక్కువ కాలం ఉపయోగించని వస్తువులను నివాసంగా మలుచుకుంటారట. దీంతో ఎప్పటికీ ఉపయోగించని వస్తువులు ఇంట్లో ఉండే అవి చెడు శకునంగా భావిస్తారు. మరి అటువంటి కొన్ని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇత్తడి పాత్రలు ప్రస్తుతం అయితే ఈ ఇత్తడి పాత్రల వాడకం చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఇతడి పాత్రలు ఉన్నప్పటికీ వాటిని స్టోర్ రూమ్ లలో పెడుతూ ఉంటారు. అయితే ఇంట్లో ఇత్తడి పాత్రలు ఉంటే దానిని శని ఆవాసంగా మార్చుకొని ఉంటాడట. తద్వారా ఎక్కువకాలం జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. పాత బట్టలు అలాగే పాత బట్టలు, పరుపులు, బొంతలు, షీట్స్ వంటివి స్టోర్ రూమ్ లలో పెట్టేస్తారు. వీటిని అలా భద్రపరచడం వలన జాతకంలో బుధగ్రహం స్థానం క్షీణిస్తుంది.
అలాగే పాత బట్టలను ఎండలో వేయడం వల్ల రాహు,కేతవుల ప్రతికూల శక్తి ఇంట్లో పెరిగి ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి. తుప్పు పట్టిన వస్తువులు, ఇంట్లో ఇనుప పనిముట్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇవి ఎక్కువ రోజులు ఉండడం వలన తుప్పు పట్టేస్తాయి. ఇంట్లో ఈ తుప్పు పట్టిన వస్తువులు ఉండడం వలన ఆందోళన, ఒత్తిడి,అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అయితే వాస్తు ప్రకారం పదునైన వస్తువులు, తుప్పు పట్టిన వస్తువులు మరింత ప్రమాదకరం. కుట్టు మెషన్ చాలా మంది ఇళ్లలో కుట్టు మిషన్ ను ఎక్కువ కాలం ఉపయోగిస్తుంటారు.
ఇంకొందరు మాత్రం కుట్టు మిషన్ ఉపయోగించకుండా ఖాళీగా పక్కన పెట్టేస్తుంటారు. అలా చేయడం వల్ల ఆ పాత మెషిన్ లలో రాహు, శని ఉంటారట. దీంతో ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. అదేవిదంగా ఆగిపోయిన గడియారం లను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు.
Related News
House Cleaning : బ్యాడ్ లక్ పోవాలంటే ఇంటిని క్లీన్ చేసుకోవలసిందే..
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వలన మనం శారీరకంగానూ, మానసికంగానూ ఆనందంగాను ఉంటాము.