కోవిడ్ అలర్ట్..నాజల్ వ్యాక్సిన్ , ఇంజెక్షన్‌తో పోలిస్తే ఏది బెటర్..?
రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని నిద్ర లేకుండా చేసిన కోవిడ్ మహమ్మారి శాంతించిందని అందరూ అనుకున్నారు. కానీ ఇదే టైంలో చైనాలో వైరస్ మరోసారి విజృంభిస్తూ అందరికీ నిద్ర లేకుండా చేస్తోంది.
- By Nakshatra Published Date - 09:45 PM, Thu - 22 December 22
రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని నిద్ర లేకుండా చేసిన కోవిడ్ మహమ్మారి శాంతించిందని అందరూ అనుకున్నారు. కానీ ఇదే టైంలో చైనాలో వైరస్ మరోసారి విజృంభిస్తూ అందరికీ నిద్ర లేకుండా చేస్తోంది. డ్రాగన్ దేశంతో పాటు ఐరోపా దేశాల్లోనూ ఈ మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తాజా కోవిడ్ విస్ఫోటనానికి ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ కారణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌లోనూ బీఎఫ్ 7 వేరియంట్ ఇప్పటికే మూడు కేసులు వెలుగులోకి రావడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. వెంటనే నిపుణుల కమిటీని వేసింది. వ్యాక్సిన్లను ఆమోదించే నిపుణుల కమిటీతో సంప్రదింపులు జరిపింది. అయితే ఈ సమయంలో నాజల్ వ్యాక్సిన్‌కు కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు వెల్లడించింది. నాజల్ వ్యాక్సిన్లు ఇంజెక్షన్లకు దూరంగా వుండే వ్యక్తులకు చాలా ఉపశమనంగా ఉంటాయని నిపుణుల కమిటీ తెలిపింది.
ఇంజెక్షన్ ద్వారా తీసుకునే టీకాల కంటే కూడా నాజల్ వ్యాక్సిన్లు చాలా మెరుగైనవిగా భావించవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కోవిడ్ పరిస్థితులపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో దీనిపై చర్చ నడిచింది. వర్చువల్‌గా జరిగిన ఈ భేటీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి ఆయెగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తదితరులు హాజరయ్యి నాజల్ వ్యాక్సిన్ గురించి పూర్తిగా చర్చించారు.
నాజల్ వ్యాక్సిన్లు ఇంజెక్షన్ ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌తో పోలిస్తే అదనపు ప్రయోజనాలను కలిగి ఉన్నట్లు నిపుణుల కమిటీ తెలిపింది. నిల్వ చేసుకోవచ్చు. పంపిణీకి సులభతరం కూడా అవుతుంది. తక్కువ వ్యర్ధాల ఉత్పత్తి జరుగుతుంది. అందుకే నాజల్ వ్యాక్సిన్లు ఎక్కువగా తయారు చేయాలని కేంద్రం సూచించింది. వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించే ముక్కు, ఎగువ శ్వాస కోశం వద్ద నాజల్ వ్యాక్సిన్లు రక్షణను అందిస్తాయని నిపుణులు వెల్లడించారు.
Related News
Bird Flu: ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వైరస్.. బర్డ్ ఫ్లూ లక్షణాలివే..!
మహమ్మారి నుండి ప్రపంచం కోలుకుంటుండగా ప్రపంచం ఇప్పుడు కొత్త వ్యాధి ముప్పును ఎదుర్కొంటోంది. ఇటీవల బర్డ్ ఫ్లూ (Bird Flu)పై ఓ పరిశోధన జరిగింది.