Amitabh Health Update: మీ ప్రార్థనలే నన్ను కోలుకునేలా చేస్తున్నాయ్: అమితాబ్
తన నివాసంలో అమితాబ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా ఆయన హెల్త్ అప్ డేట్ గురించి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
- By Balu J Published Date - 12:46 PM, Tue - 7 March 23

బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ప్రతిష్టాత్మకమైన మూవీ ప్రాజెక్టు కే షూట్ లో గాయాలైన విషయం తెలిసిందే. ఆయన కుడి పక్కటెముకకు కండరాలు చిట్టినట్టు తెలుస్తోంది. 80 ఏళ్ల స్టార్ పై యాక్షన్ షాట్ చిత్రీకరిస్తున్నప్పుడు పక్కటెముకలు కదిలి గాయాలయ్యాయి. అయితే వెంటనే వైద్య పరీక్షలు జరిపి ముంబైకు తరలించారు. ప్రస్తుతం తన నివాసంలో అమితాబ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా ఆయన హెల్త్ అప్ డేట్ గురించి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. మీ ప్రార్థనలు నన్ను కోలుకునేలా చేస్తున్నాయి. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతిఒక్కరికి ధన్యావాదాలు అంటూ బిగ్ బీ రియాక్ట్ అయ్యారు.
అయితే శరవేగంగా కొనసాగుతున్న షూటింగ్ నుంచి వైదొలగడంతో ప్రాజెక్టు కే టీం ఆందోళనలో పడింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంది. ఇక పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు నాగ్ అశ్విన్. మరి ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
T 4575 – gratitude and love ever .. for your concern and wishes
— Amitabh Bachchan (@SrBachchan) March 7, 2023
Also Read: Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసు.. హైదరాబాద్ వ్యాపారవేత్త అరెస్ట్!

Related News

Sabarimala: దారుణం.. లోయలో పడిన బస్సు.. గాయపడిన 62 మంది అయ్యప్ప స్వామి భక్తులు?
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన కూడా వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వాహన ప్రమాదాల