Yemi Maya Premalona : యూట్యూబ్ లో దూసుకెళ్తున్న ‘ఏమి మాయ ప్రేమలోన’ సాంగ్స్
Yemi Maya Premalona : అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందిన ‘ఏమి మాయ ప్రేమలోన’ మ్యూజిక్ ఆల్బమ్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను పొందుతోంది
- Author : Sudheer
Date : 27-10-2025 - 3:42 IST
Published By : Hashtagu Telugu Desk
అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందిన ‘ఏమి మాయ ప్రేమలోన’ మ్యూజిక్ ఆల్బమ్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను పొందుతోంది. ఈ ఆల్బమ్‌లో హీరోగా అనిల్ ఇనుమడుగు, హీరోయిన్‌గా వేణి రావ్ నటించారు. ప్రత్యేకత ఏమిటంటే, లీడ్ రోల్‌లో నటించిన అనిల్ ఇనుమడుగు ఈ పాటకు లిరిక్స్ రాసి, దర్శకత్వం వహించడం విశేషం. మార్క్ ప్రశాంత్ సంగీతం అందించగా, ఈ పాటను దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య ఆలపించారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ మ్యూజిక్ ఆల్బమ్ 1 మిలియన్ వ్యూస్‌ను దాటి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.
Jigris : ‘జిగ్రీస్’ విడుదల తేదీ ఫిక్స్
కేరళలో టూరిస్టు గైడ్‌గా పనిచేసే అనాథ కుర్రాడి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మ్యూజిక్ వీడియో అందమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దసరా కానుకగా విడుదలైన ఈ వీడియో, సున్నితమైన కాన్సెప్ట్, చక్కటి దర్శకత్వం, అద్భుతమైన మ్యూజిక్‌తో మంచి పేరు తెచ్చుకుంది. ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా మలిచిన సినిమాటోగ్రాఫర్ శ్రవణ్ కేరళ సౌందర్యాన్ని అద్భుతంగా చూపించారు. అనిల్ ఇనుమడుగు, వేణి రావ్ జంట స్క్రీన్‌పై సహజంగా నటించి మంచి కెమిస్ట్రీని చూపించారు. యంగ్ ప్రొడ్యూసర్స్ అజయ్ కుమార్ ఇనమడుగు, విష్ణు పాదర్తి నిర్మించిన ఈ పది నిమిషాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.