YCP Support to Pushpa 2 : అల్లు అర్జున్ కు తలనొప్పిగా మారిన వైసీపీ..
YCP Support to Pushpa 2 : ఇప్పుడు థియేటర్స్ లలో పలు ప్లెక్సీలు ఏర్పాటు చేసి బన్నీ కి సపోర్ట్ పలుకుతుండడం మెగా అభిమానుల్లో మంట పుట్టిస్తుంది. మా కోసం నీవు వచ్చావు..మీ కోసం మేము వస్తాం..తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్‌కు సపోర్టు చేస్తూ వెలసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి
- Author : Sudheer
Date : 04-12-2024 - 4:13 IST
Published By : Hashtagu Telugu Desk
అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 2 (Pushpa 2) మూవీ మరికాసేపట్లో థియేటర్స్ లలో ప్రదర్శన మొదలుకాబోతుంది. ఈ క్రమంలో వైసీపీ (YCP) చేస్తున్న హడావిడి హీరో అల్లు అర్జున్ కు మేకర్స్ కు టెన్షన్ పెడుతుంది. గత కొద్దీ రోజులుగా అల్లు అర్జున్ పై మెగా అభిమానులు (Mega Fans), జనసేన శ్రేణులు (Janasena Leaders)ఆగ్రహం గా ఉన్న సంగతి తెలిసిందే. తన ఎదుగుదలకు కారణమైన చిరంజీవి ని ఇప్పుడు పక్కకు పెట్టడం తో మెగా అభిమానులు , ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ నేతకు అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడం తో జనసేన శ్రేణులు బన్నీ పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. టైం చూసి దెబ్బ కొట్టాలని కాచుకొని కూర్చున్నారు.
ఇప్పటికే పుష్ప 2 ను అడ్డుకుంటామని జనసేన నేత చలమలశెట్టి రమేశ్‌బాబు (Janasena Leader Chalamalasetty Ramesh Babu) హెచ్చరించడం ఇప్పుడు చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది. “పుష్ప-2” చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరించిన ఆయన, అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణ చెప్పకపోతే సినిమాను తీవ్రంగా ప్రతిఘటించుతామని వెల్లడించారు. జనసేన శ్రేణులు , మెగా అభిమానులు కూడా ఇదే మాట చెపుతున్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్ తర్వాత ఏంజరుగుతుందో..? ఎలాంటి ప్రచారం చేస్తారో..? ఎంత ప్రమాదం ముందు ఉందొ అని మేకర్స్ ఖంగారుపడుతున్నారు. ఈ క్రమంలో ఇదే ఆసరాగా చేసుకొని వైసీపీ మరింతగా జనసేన శ్రేణులను , మెగా అభిమానులను రెచ్చగొడుతుంది. ఇప్పటీకే పుష్ప 2 రిలీజ్ విషయంలో పలువురు వైసీపీ నేతలు సపోర్ట్ ఇవ్వడం..బన్నీ వెనుకాల మీమున్నాం…ఎవ్వరు అడ్డుకుంటారో చూస్తాం అన్నట్లు స్టేట్మేట్స్ ఇచ్చారు. ఇక ఇప్పుడు థియేటర్స్ లలో పలు ప్లెక్సీలు ఏర్పాటు చేసి బన్నీ కి సపోర్ట్ పలుకుతుండడం మెగా అభిమానుల్లో మంట పుట్టిస్తుంది. మా కోసం నీవు వచ్చావు..మీ కోసం మేము వస్తాం..తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్‌కు సపోర్టు చేస్తూ వెలసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి మేకర్స్ కు ఇంకాస్త ఖంగారు మొదలుఅవుతుంది. మరి థియేటర్స్ లలో ఏంజరుగుతుందో..పుష్ప 2 టాక్ ఎలా ఉండబోతుందో చూడాలి.
ఒకవైపు పుష్ప 2ను జనసేన ట్రోల్ చేస్తుంటే.. మరోవైపు పుష్ప2 కు సపోర్టు చేస్తున్న వైసీపీ మా కోసం నీవు వచ్చావు..మీ కోసం మేము వస్తాం..తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్‌కు సపోర్టు చేస్తూ వెలసిన ఫ్లెక్సీలు #AlluArjun #YSJaganMohanReddy #Pushpa2ThaRule #AndhraPradesh #HashtagU pic.twitter.com/U3WtsKTOat
— Hashtag U (@HashtaguIn) December 4, 2024
Read Also : Telangana Talli Statue : రేవంత్ ఆటలు ఎల్లకాలం సాగవు – కేటీఆర్