Yash Reveals: ఆ హీరో తల్లి ప్రేమ వెలకట్టలేనిది!
కేజీఎఫ్ హీరో యశ్ బిజీ బిజీగా ఉన్నాడు. కేజీఎఫ్-2 ప్రమోషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాలను చుట్టేస్తున్నారు.
- By Balu J Published Date - 04:15 PM, Wed - 13 April 22
కేజీఎఫ్ హీరో యశ్ బిజీ బిజీగా ఉన్నాడు. కేజీఎఫ్-2 ప్రమోషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాలను చుట్టేస్తున్నారు. అందులో భాగంగా ఆయన హైదరాబాద్ సిటీకి వచ్చి, ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. ఈ సందర్భంగా హీరో యశ్ మాట్లాడుతూ.. తనకు తెలుగు హీరోలతో మంచి అనుబంధం ఉందాన్ని గుర్తు చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ మంచి స్నేహితులు అని తెలిపాడు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్ఆర్ఆర్ చాలా బాగుందనీ, సినిమా చూస్తున్నంత సేపు థ్రిల్స్ కు గురయ్యానని అన్నాడు.
షూటింగ్‌కి సంబంధించిన ట్రిప్‌ల కోసం నేను హైదరాబాద్‌లో వచ్చినప్పుడల్లా రామ్ చరణ్ ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని పంపుతుంటాడు” అని యష్ వెల్లడించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. తాను రెండుసార్లు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లానని, ఎన్టీఆర్ తనని వ్యక్తిగతంగా డిన్నర్‌కి ఆహ్వానించాడని, ముఖ్యంగా ఎన్టీఆర్ తల్లి ప్రేమ వెలకట్టలేనిదని అన్నాడు. ఎన్టీఆర్ కుటుంబం చేసిన ఆతిథ్యాన్ని నా జీవితాంతం మర్చిపోలేనని, ఎన్టీఆర్ తల్లి ప్రత్యేకించి నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారని, మా బంధం మరింత బలపడిందని, ఎన్టీఆర్ తల్లి కర్ణాటకకు చెందినది కాబట్టి నాతో బాగా మాట్లాడారని అని యష్ వివరించారు. కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజిఎఫ్: చాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.
Related News
Sabari: ‘శబరి’ టైటిల్ పెట్టడం వెనుక అసలు ఉద్దేశం అదే – దర్శకుడు అనిల్ కాట్జ్ ఇంటర్వ్యూ
Sabari: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. దర్శకులు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ ‘శబరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కా�