HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >With Rrr The Director Rajamouli Achieves Records

Rajamouli:’RRR’ తో ఏ డైరెక్టర్ సాధించని మూడు రికార్డులు క్రియేట్ చేసిన ‘రాజమౌళి’..!

ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం ఎక్కడ చూసినా... ఆయన పేరే మారుమ్రోగుతోంది.

  • Author : Hashtag U Date : 09-04-2022 - 7:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Alia Rajamouli
Alia Rajamouli

ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం ఎక్కడ చూసినా… ఆయన పేరే మారుమ్రోగుతోంది. జక్కన్న ఓకే అంటే హాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థలు కూడా ఆయనతో సినిమాలు చేయటానికి సిద్దంగా ఉన్నాయి. బాహుబలి, “RRR” సినిమాలతో తన దర్శకత్వ ప్రతిభ ఏంటో ప్రపంచానికే పరిచయం చేశారు రాజమౌళి. ఈ సినిమాలన్నీ కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులే కాదు.. వరల్డ్ వైడ్ గా తెలుగువాడి సత్తా ఏంటో చూపించాయి. జక్కన్న అంటేనే.. టేకింగ్ తో పాటు విజువలైజేషన్.. క్యారెక్టర్ల లో భావోద్వేగాలు.. చూసే ప్రేక్షకుల హృదయాలను పిండేసే రీతిలో కథను నడిపించడం. అందుకే ప్రపంచ సినీ దిగ్గజాలు రాజమౌళిలోని డైరెక్షన్ టాలెంట్ కి ఫిదా అయిపోతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ తో పాటు, చాలామంది నిర్మాతలు జక్కన్న తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాజమౌళి ఓకే అంటే చాలు ఎన్ని కోట్ల రూపాయలు అయినా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. ఇదిలా ఉంటే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో విడుదలైన “RRR” మూవీ… సునామి కలెక్షన్లతో దూసుకుపోతూ…. బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే “RRR” చిత్రంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ దర్శకుడు నమోదు చేయని మూడు రికార్డులను రాజమౌళి నమోదు చేయడం విశేషం. ఆ మూడు రికార్డులు ఏంటంటే.. బాలీవుడ్ మార్కెట్ (హిందీ) లో వరుసపెట్టి మూడు సినిమాలతో రూ. 100 కోట్లు కలెక్ట్ చేయటం. రెండో రికార్డు.. అమెరికాలో వరుసగా రెండు సినిమాలతో 10 మిలియన్ డాలర్లు సాధించడం. ఇక మూడో రికార్డు ఏంటంటే… వరుసగా హ్యాట్రిక్ సినిమాలతో రూ. 500 కోట్లు కలెక్ట్ చేయడం. ఇలా ఇప్పటివరకు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఏ దర్శకుడు కూడా ఇలాంటి ఫీట్ ను సాధించలేదు.. ఒక్క రాజమౌళి తప్ప. అందుకే రాజమౌళి అంటే… ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హీరోలు, ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆయనతో కలిసి సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఒక తెలుగు దర్శకుడు ఈ విధంగా కీర్తిగడించడం అనేది నిజంగా మన తెలుగు వారికి గర్వకారణం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • rajamouli
  • Records
  • rrr

Related News

Priyanka Chopra Varanasi

Varanasi Movie: ‘వారణాసి’ మూవీ షూటింగ్ గురించి కీలక అప్డేట్ ఇచ్చిన ప్రియాంక చోప్రా

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన తాజా హాలీవుడ్ చిత్రం ‘బ్లఫ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ‘వారణాసి’ ప్రాజెక్ట్ గురించి కీలక అప్డేట్స్ ఇచ్చారు. ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులలో ఒకరని కొనియాడిన ఆమె, ఈ సినిమా భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెబుతుందని

    Latest News

    • ఫైన‌ల్లోకి భార‌త్‌.. 7 ప‌రుగుల‌తో ఇంగ్లాండ్‌పై ఘ‌న విజ‌యం!

    • 23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

    • 19 ఏళ్ల క్రితం ధోనీ.. ఇప్పుడు శివ‌మ్ దూబే!

    • ఇంగ్లాండ్‌తో సెమీ ఫైన‌ల్ పోరు.. చ‌రిత్ర సృష్టించిన భార‌త్‌!

    • Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?

    Trending News

      • పాకిస్థాన్ క్రికెట్‌ జట్టులో కలకలం!

      • పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?

      • ఇంగ్లాండ్‌తో భారత్ కీల‌క పోరు.. అభిషేక్ శ‌ర్మ‌కు నో ప్లేస్‌?!

      • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

      • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తుది వీడ్కోలు.. ఖ‌న‌నం ఎక్క‌డంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd