NTR Ram Charan : దసరాకి ఎన్టీఆర్ దేవరతో పాటు ఇవి కూడా వచ్చే ఛాన్స్..!
NTR Ram Charan యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న దేవర సినిమాను దసరా బరిలో దించేందుకు సిద్ధమయ్యాడు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందు ఏప్రిల్ 5న
- By Ramesh Published Date - 08:48 AM, Sat - 17 February 24

NTR Ram Charan యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న దేవర సినిమాను దసరా బరిలో దించేందుకు సిద్ధమయ్యాడు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందు ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేయగా ఆ టైం కు తీసుకు రావడం కష్టమని తెలిసి ఫైనల్ గా అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. ముందు ఒక సినిమాగా ప్లాన్ చేసిన దేవర ఇప్పుడు రెండు భాగాలుగా వస్తుంది. దేవర 1 అక్టోబర్ 10న వస్తుంది. దేవర రాకతో దసరా పోటీ రసవత్తరంగా మారింది.
దేవర తో పాటు రాం చరణ్ గేం చేంజర్ సినిమా కూడా దసరాకే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. శంకర్ డైరెక్షన్ లో చరణ్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. శంకర్ నుంచి ఆఫ్టర్ స్మాల్ గ్యాప్ వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గేం చేంజర్ సినిమా పక్కా కమర్షియల్ మూవీగా ఆడియన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని నిర్మాత దిల్ రాజు అంటున్నారు.
దేవర, గేం చేంజర్ తో పాటుగా మంచు విష్ణు కన్నప్ప కూడా దసరా ఫైట్ లో దిగుతుందని తెలుస్తుంది. భక్త కన్నప్ప కథతో వస్తున్న ఈ సినిమా కోసం మంచు విష్ణు 100 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేస్తున్నారు. సినిమాలో ప్రభాస్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రభాస్ పేరుతో సినిమాను భారీగానే మార్కెట్ చేసేలా ఉన్నారు కన్నప్ప టీం.
దసరా ఫైట్ లో సూపర్ స్టార్ రజిని వెట్టయ్య కూడా వస్తుందని టాక్. అయితే ఈమధ్య తెలుగులో రజిని మార్కెట్ బాగా దెబ్బ తిన్నది. రీసెంట్ గా రజిని గెస్ట్ అప్పియరెన్స్ చేసిన లాల్ సలాం అయితే తెలుగులో ఎవరి పట్టించుకోలేదు. మరి దసర ఫైట్ లో రజిని సినిమా పోటీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Pushpa 3 : పుష్ప 3 అఫీషియల్ గా చెప్పేసిన అల్లు అర్జున్.. పుష్ప ఫ్రాంచైజ్ కొనసాగుతుంది..!