సంక్రాంతి-2026 రేస్ : బరిలో విజేత ఎవరో?
సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. ఈసారి కూడా పెద్ద, చిన్న హీరోలందరూ పొంగల్ బరిలో నిలిచారు. ప్రభాస్ 'రాజాసాబ్', మెగాస్టార్ చిరంజీవి 'MSVG', రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ 'అనగనగా ఒక రాజు', శర్వానంద్
- Author : Sudheer
Date : 07-01-2026 - 2:14 IST
Published By : Hashtagu Telugu Desk
- సంక్రాంతి బరిలో బడా చిత్రాలు
- చిరంజీవి , ప్రభాస్ ల మధ్య తీవ్ర పోటీ
- ఈసారి సంక్రాంతి విన్నర్ ఎవరో
- రవితేజ , శర్వానంద్ , నవీన్ లు సైతం పోటీ
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, అది వెండితెరపై జరిగే ఒక పెద్ద పండుగ. ఏటా సంక్రాంతి బరిలో దిగేందుకు అగ్ర కథానాయకులందరూ పోటీ పడుతుంటారు. ఈ ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద మెగా, మాస్, మరియు క్లాస్ సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బాక్సాఫీస్ విజేతగా నిలిచి ప్రేక్షకులను అలరించగా, ఈసారి పోటీ మరింత రసవత్తరంగా మారింది. భారీ బడ్జెట్ చిత్రాల నుండి విభిన్నమైన కథాంశాల వరకు మొత్తం ఐదు ప్రధాన చిత్రాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి.

2026 Sankranthi Movies
ఈసారి సంక్రాంతి పోటీలో ప్రధాన ఆకర్షణగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSVG) మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ నిలుస్తున్నాయి. ప్రభాస్ ఒక సరికొత్త హారర్ కామెడీ జానర్‌లో ‘రాజాసాబ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, మెగాస్టార్ తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ తనదైన కామెడీ టైమింగ్‌తో వస్తుండగా, యువ హీరోలు నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మరియు శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు.
ఈ చిత్రాల విడుదల నేపథ్యంలో థియేటర్ల వద్ద ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి సినిమా తనదైన ప్రత్యేకతతో వస్తుండటంతో, ఏ సినిమా ‘సంక్రాంతి మొనగాడు’గా నిలుస్తుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పెద్ద హీరోల చిత్రాలకు భారీ స్థాయిలో థియేటర్లు కేటాయిస్తుండగా, కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా సంక్రాంతి విజేతలుగా నిలుస్తాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంక్రాంతి రేసు తెలుగు సినీ పరిశ్రమకు భారీ వసూళ్లను అందిస్తుందని, ప్రేక్షకులకు మాత్రం పసందైన వినోదాన్ని పంచుతుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.