HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Which Telugu Song Has Joined The Fastest 200 Million Club On Youtube

Telugu Song : ఆ తెలుగు సాంగ్ హవా.. యూట్యూబ్​లో ఫాస్టెస్ట్ 20 కోట్ల వ్యూస్

Telugu Song :  యూట్యూబ్.. ప్రతి ఒక్కరి ఫేవరేట్ సోషల్ మీడియా యాప్ !! దీనిపై మనకు ఎలాంటి డౌటూ ఉండాల్సిన అవసరం లేదు.

  • By Pasha Published Date - 08:32 AM, Mon - 22 April 24
  • daily-hunt
Telugu Song
Telugu Song

Telugu Song :  యూట్యూబ్.. ప్రతి ఒక్కరి ఫేవరేట్ సోషల్ మీడియా యాప్ !! దీనిపై మనకు ఎలాంటి డౌటూ ఉండాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కొన్ని ఎంపిక చేసిన చిన్న తరహా సినిమాలను కూడా చాలా తక్కువ టైంలోనే యూట్యూబ్‌లో రిలీజ్ చేసేస్తున్నారు. అంతగా యూట్యూబ్ పబ్లిక్ ట్యూబ్‌గా మారిపోయింది. ఏ సినిమాకు ఏ రేంజులో పబ్లిక్ క్రేజ్ ఉందనే దానిపై ప్రాథమిక అవగాహనకు వచ్చేందుకు.. ఆయా సినిమాల ట్రైలర్ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను ఈ మధ్య జనం బాగా చెక్ చేస్తున్నారు.  ఈక్రమంలోనే తాజాగా ఓ తెలుగు సినిమా సాంగ్ యూట్యూబ్ వేదికపై దుమ్మురేపింది. రిలీజైన 68 రోజుల్లోనే యూట్యూబ్​లో ఆ పాటకు  20 కోట్లకుపైగా వ్యూస్ రావడం విశేషం.వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

అల్లు అర్జున్ బ్లాక్​బస్టర్ మూవీ ‘పుష్ప’ పార్ట్- 1.  ఈ సినిమాలోని ‘ఊ అంటావా? ఉఊ అంటావా’ సాంగ్(Telugu Song)  ఎంత సంచలనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఆ మ్యూజిక్ వింటూ అందరూ ఎంతో ఎంజాయ్ చేశారు. గాన మాధుర్యం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎఫెక్టుతో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో అలరించిన ఈ పాట యూట్యూబ్‌లో తడాఖా చూపించింది. ఈ పాటకు రిలీజైన 68 రోజుల్లోనే యూట్యూబ్​లో  20 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్​లో ఇంత తక్కువ టైంలో  ఇన్ని భారీ వ్యూస్  సాధించిన ఏకైక సాంగ్‌గా ‘ఊ అంటావా? ఉఊ అంటావా’ రికార్డు పుటల్లోకి ఎక్కింది. ఈ సాంగ్​లో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ అప్పియరెన్స్​ గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు.

Also Read :Gukesh : భళా గుకేశ్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడు

తక్కువ రోజుల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన తెలుగు పాటల లిస్టును రూపొందించగా.. అందులో నంబర్ 1 ప్లేసులో  ‘ఊ అంటావా? ఉఊ అంటావా’ నిలిచింది. మూడో ప్లేసులోనూ అల్లు అర్జున్ పాటే నిలిచింది. బన్నీ- పూజా హెగ్డే కాంబినేషన్‌లో ఉండే ‘బుట్టబొమ్మ బుట్టబొమ్మ’ సాంగ్ 95 రోజుల్లో 20 కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. ఈ సాంగ్‌తో నెటిజన్లు సోషల్ మీడియాలో లక్షలాది  రీల్స్ చేశారు. దీన్నిబట్టి ఆ సాంగ్‌కు అప్పట్లో లభించిన క్రేజ్‌ను మనం అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా తన పిల్లలతో ఈ పాటకు రీల్స్ చేయడం వైరల్ అయింది. ఇక టాలీవుడ్​ స్టార్ హీరో మహేశ్ బాబు- శ్రీలీల సూపర్ హిట్ మూవీ ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ 78 రోజుల్లోనే 20 కోట్ల వ్యూస్‌ను సాధించి ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. ఈ మధ్య గ్రాండ్ ఈవెంట్స్​, బర్త్​డే ఫంక్షన్స్ ఎక్కడ చూసినా ఈ పాటే ఎక్కువగా వినిపిస్తోంది.

Also Read :Daggubati Purandeswari : కేక్ కట్ చేసిన ఏపీ బీజేపీ చీఫ్.. దగ్గుబాటి పురంధేశ్వరి పుట్టినరోజు వేడుకలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fastest 200 million Views
  • Telugu Song
  • youtube

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd