Puri Jagannath: అజ్ఞాతవాసంలో పూరి జగన్నాథ్.. చిరు సినిమాపై సస్పెన్స్!
మూడు నెలల్లో సినిమాని తీయగల సామర్థ్యం ఉన్న డైరెక్టర్ ఉన్నట్టుండి ఎక్కడా కనిపించడం లేదు
- Author : Balu J
Date : 17-03-2023 - 12:52 IST
Published By : Hashtagu Telugu Desk
పూరి జగన్నాథ్ (Puri Jagannath) ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. కానీ ఆయన ఏమి చేస్తున్నాడనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. డైనమిక్ ఫిల్మ్ మేకర్, మూడు నెలల్లో సినిమాని తీయగల సామర్థ్యం ఉన్న డైరెక్టర్ ఉన్నట్టుండి ఎక్కడా కనిపించపోవడంతో పూరి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. “ఇస్మార్ట్ శంకర్”తో బ్లాక్ బస్టర్ చేసిన తర్వాత “లైగర్” (Liger) మూవీతో కోలుకోలేని దెబ్బ తిన్నాడు. అయినా పూరి అదరలేదు, బెదరలేదు. కాకపోతే ఫెయిల్యూర్ కారణంగా పంపిణీదారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆర్థిక విభేదాల కారణంగా ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే పూరి (Puri Jagannath) తదుపరి ప్రాజెక్ట్ గురించి ఎటువంటి వార్తలు లేవు.
మొదట్లో పూరి జగన్నాధ్ మెగాస్టార్‌కి స్క్రిప్ట్‌ని అందించాడని వార్తలు వచ్చాయి, కానీ కానీ ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రస్తుతం మెగాస్టార్ “భోళాశంకర్” తర్వాత పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ కోసం వెతుకుతున్నాడు. చాలా మంది దర్శకులు లైన్లో ఉన్నారు. కానీ పూరి పేరు బయటకు రాలేదు. ఇప్పుడు పూరి జగన్నాధ్‌కి మెగాస్టార్ మాత్రమే సరైన ఎంపిక అని తెలుస్తోంది. అయితే మెగాస్టార్ ఇతర దర్శకులను కూడా అన్వేషిస్తున్నాడు. “లైగర్” కారణంగా పూరీ (Puri Jagannath) కి సొంతంగా సినిమా నిర్మించడం కష్టం. ఈ విషయాలను బట్టి చూస్తే పూరి అజ్ఞాతంలోకి వెళ్లాడని తెలుస్తోంది.
Also Read: Disha Patani: సెక్సీ ఫోజులతో మంట పెడుతున్న దిశా పటానీ.. వీడియో వైరల్!