Rumours : చైతూ, అనుష్కశెట్టి ఎంగేజ్ మెంట్ రూమర్స్ పై నాగ్ రియాక్షన్ ఇదే!
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. తమ నటనతో, అందంతో ఎంటర్ టైన్ చేసే యాక్టర్స్ కు సహజంగా అభిమానులు ఎక్కువగా ఉంటారు. వాళ్ల గురించి ఏ చిన్న న్యూస్ చెవినపడిన ఆసక్తిగా వింటారు.
- By Balu J Published Date - 12:05 PM, Thu - 18 November 21
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. తమ నటనతో, అందంతో ఎంటర్ టైన్ చేసే యాక్టర్స్ కు సహజంగా అభిమానులు ఎక్కువగా ఉంటారు. వాళ్ల గురించి ఏ చిన్న న్యూస్ చెవినపడిన ఆసక్తిగా వింటారు. అక్కడితో వదిలేయకుండా చర్చించుకుంటారు కూడా. అందుకే సినిమా నటులపై బోలెడన్నీ గాపిస్స్ పుట్టుకొస్తుంటాయి. అందులో కొన్ని నిజం అని తేలితే.. మరికొన్ని రూమర్స్ గా మిగిలిపోతుంటాయి. గతంలో టాలీవుడ్ హీరో నాగచైతన్యకు సంబంధించిన ఓ రూమర్ ఇండస్ట్రీలో హల్ చల్ చేసింది. అదేమిటంటే…?
టాలీవుడ్ హీరో నాగార్జున అక్కినేని ముక్కుసూటిగా ఉండే నటుడు. తన మనసులోని మాటను చెప్పడానికి ఎప్పుడూ వెనుకాడడు. ఏ విషయంలోనూ అనవసరంగా నోరుజారే వ్యక్తి కాదు. అయితే 2017 లో ఓ ఇంటర్వ్యూలో నాగ్ తన కుమారుడు చైతూ, అనుష్కశెట్టి ఎగేంజ్ మెంట్ రూమర్స్ పై రియాక్ట్ అయ్యాడు. త్రోబాక్ ఇంటర్వ్యూలో నాగార్జున అక్కినేని రూమర్స్ ఎలా స్పందించారో షేర్ చేసుకున్నారు. ‘‘నాగచైతన్య, అనుష్కశెట్టికి ఎగేంజ్ మెంట్ జరిగిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ విషయం నా వరకు వచ్చింది. ఆ సమయంలో చైతూ స్విట్జర్లాండ్‌లో షూటింగ్ చేస్తున్నాడు. నేను ఉదయాన్నే చైతూ ఫోన్ చేసి చెప్పాను. ‘‘హేయ్, నీకు నిన్న రాత్రి అనుష్కతో నిశ్చితార్థం జరిగింది, మీరు నాకు కూడా చెప్పలేదు. దానికి చైతూ రెస్పాండ్ అవుతూ.. ‘వాహ్, నిజమే’ అని బిగ్గరగా నవ్వాడు. ఆ తర్వాత నేను అనుష్కని కూడా పిలిచా. అందరం బాగా నవ్వుకున్నాము.” అని అన్నారు నాగార్జున.
నాగార్జున మాత్రమే కాదు, చై, అనుష్క కూడా ఎగేంజ్ మెంట్ పుకార్లు విని షాక్ అయ్యారు. ఇదంతా ఎలా స్పెడ్ అయ్యిందో తెలియదట. అనుష్క స్పందిస్తూ.. ఎవరో ఒక నిర్మాత కావాలనే రూమర్ పుట్టించాడని చెప్పుకొచ్చింది. కాగా గతంలో నాగార్జునకు అనుష్క శెట్టి, ఛార్మీ కౌర్‌తో సహా చాలా మంది నటీమణులతో కూడా లింక్ ఉన్నట్లు కూడా గాసిప్స్ వినిపించాయి.
Related News
Prabhas Anushka : కన్నప్ప ప్లాన్ అదిరింది.. ప్రభాస్ తో పాటు అనుష్క కూడా..!
Prabhas Anushka మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కన్నప్ప. మంచు విష్ణు కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్