Jai Bhim : జై భీమ్ వీడియో క్లిప్ లో ఏముంది? ఎందకంతా కంట్రావర్సీ?
తమిళ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘జైభీమ్’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ బాగుంది అంటూ బిగ్ అప్లాజ్ ఇస్తున్నారు.
- By Balu J Published Date - 03:47 PM, Wed - 3 November 21

తమిళ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘జైభీమ్’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ బాగుంది అంటూ బిగ్ అప్లాజ్ ఇస్తున్నారు. హీరో సూర్య లాయర్ పాత్రలో అద్భుతంగా నటించారని సినీ క్రిటిక్స్ సైతం మెచ్చుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందీలో మాట్లాడినందుకుగాను ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, ఒక వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన వీడియో వివాదానికి దారితీసింది. ఈ సన్నివేశం హిందీ మాట్లాడేవారిని కించపరిచేలా ఉందని కొందరు చెబుతుండగా, మరికొందరు మేకర్స్, నటులను మాత్రం మద్దుతుగా నిలిచారు.
Dear Prakash Rai alias Prakash Raj, which article of the constitution provides rights to hit any individual just because he's not speaking Hindi or any Indian language?
If that's so, how many Kannadigas should hit u for speaking in Hindi, Tamil, Malayalam, Telugu in other movies? pic.twitter.com/y0GQrnX1Tf— Chiru Bhat | ಚಿರು ಭಟ್ (@mechirubhat) November 2, 2021
వీడియోలో ఏముందంటే..
‘జై భీమ్’ సమాజంలో బలంగా పేరుకుపోయిన కొన్ని సామాజిక సమస్యలను లేవనెత్తినందుకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రంలోని ఓ సన్నివేశం సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేయడం ప్రారంభించిన తర్వాత ఈ చిత్రం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. క్లిప్‌లో ప్రకాష్ రాజ్ ‘హిందీలో మాట్లాడటం’ కోసం ఒక వ్యక్తిని చెంపదెబ్బ కొడతాడు. హిందీ బదులు తమిళంలో మాట్లాడమని సీరియస్ అవుతాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్విట్టర్‌లోని ఒక వర్గం వ్యక్తులు ఈ సీన్ చూసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మూవీ హిందీపై ద్వేషం చిమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆయన హిందీలో మాట్లాడినందుకు ఆ వ్యక్తిని చెప్పుతో కొట్టలేదని, హిందీలో మాట్లాడి అయోమయానికి గురిచేశాడని మరికొంతమంది అభిప్రాయపడ్డారు.
Dear sanghi,
the scene is not against Hindi-speakers.
The particular character tries to evade by speaking in Hindi (so that PrakashRaj wouldn't understand) & knowing this strategy, he slaps & asks him to tell I'm tamil.anyways, consider it as Return gift for #HindiImposition
— surya 💛❤️ (@sachinsurya200) November 2, 2021
నెటిజన్స్ సీరియస్
‘‘జైభీమ్ చూసిన తర్వాత నేను నిజంగా బాధపడ్డాను. ఈ మూవీ ఎవరికీ వ్యతిరేకంగా లేదు. చెడు సంఘటనలు కూడా లేవు. కానీ ఒక వ్యక్తి హిందీ మాట్లాడే సన్నివేశం ఉంది. ప్రకాష్ రాజ్ అతనిని చెంపదెబ్బ కొట్టి తమిళంలో మాట్లాడమని చెప్పాడు. నిజాయితీగా ఈ రకమైన సన్నివేశం అవసరం లేదు. దానిని కట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
Related News

Prakash Raj : కన్నడ ప్రజల తరపున సిద్ధార్థకు క్షమాపణలు చెప్పిన ప్రకాశ్‌రాజ్
కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ సమస్య దశాబ్దాలుగా ఉందని, ఇన్నేళ్ల కాలంలో సమస్యను పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలు, నాయకులను ప్రశ్నించలేదని, సమస్య పరిష్కారం