HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >What Is The Relation Between Pushpa And Mayanpulli

Pushpa:పుష్పకి మన్యంపులికీ సంబంధం.. అసలు కథేంటీ..?

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప. సుకుమార్ డైరెక్షన్ లో ఈ ఇద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తోన్న చిత్రం ఇది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ నెల 17న భార అంచనాల మధ్య ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా విడుదల కాబోతోంది.

  • By Hashtag U Published Date - 04:05 PM, Wed - 15 December 21
  • daily-hunt
Pushpa
Pushpa

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప. సుకుమార్ డైరెక్షన్ లో ఈ ఇద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తోన్న చిత్రం ఇది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ నెల 17న భార అంచనాల మధ్య ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా విడుదల కాబోతోంది. మళయాల స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రంలో సునిల్, అనసూయ, ధనుంజయ(కన్నడ యాక్టర్) విలన్ పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హాట్ హాట్ టాపిక్ గా మారింది. విడుదల విషయంలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ట్రైలర్ చూస్తే మరీ గొప్పగా అనిపించకపోయినా.. లేటెస్ట్ గా ఈ మూవీకీ మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మన్యంపులికీ పోలికలున్నాయంటూ ఇంకా చెబితే కథ ఇదే అంటూ కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
మన్యంపులిలో మోహన్ లాల్ చిన్నప్పుడే అతని తండ్రిని ఓ పులి చంపేస్తుంది. కుర్రాడిగా ఉన్నప్పుడే ఆ పులిని చంపి పగ తీర్చుకుంటాడు హీరో. తర్వాత పులి వేటగాడుగా ఆ ప్రాంతం అంతా పేరు తెచ్చుకుంటాడు. ఇటు పుష్పలో కూడా ఇంచుమించు ఇలాంటి సెంటిమెంట్ తో కూడిన రివెంజ్ డ్రామానే ఉంటుందంటున్నారు. హీరో చిన్నతనంలోనే అతని తండ్రి విధిలేని పరిస్థితుల్లో ఎర్రచందనం స్మగ్లర్ గా మారతాడు. పోలీస్ ల రైడ్ లో అతను మరణించడం లేదా జైలుకు వెళ్లడమో జరుగుతుంది. ఆ టైమ్ లో పోలీస్ లు ప్రవర్తించిన తీరుకు ప్రతీకారంగానే పుష్ప చిన్నతనుంచీ తండ్రి పనిలో ఎంటర్ అయి.. పోలీస్ లకు దొరకకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతూ సవాల్ విసురుతాడు. ఆ సవాల్ లో భాగంగానే ఫహాద్ పాత్ర వస్తుంది. ఈ ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ లా సెకండ్ పార్ట్ ఉంటుందట. నిజానికి తన తండ్రికి సంబంధించిన ఎపిసోడ్ కూడా సెకండ్ హాఫ్ లోనే రివీల్ చేస్తారనీ.. ఆ రివీలింగ్ పాయింట్ తోనే ఫస్ట్ హాఫ్ ముగుస్తుందంటున్నారు.
మొత్తంగా పుష్ప కూడా ఓ సాధారణ రివెంజ్ డ్రామానే. కాకపోతే దీన్ని సుకుమార్ తనదైన శైలిలో తెరకెక్కించి ఉంటాడు అనుకోవచ్చు. అల్లు అర్జున్ ఇమేజ్ కూడా కలిసి సినిమాను కొత్తగా చూపిస్తాయోమో కానీ.. మరీ కొత్త కథైతే కాదు. ఎర్రచందనం స్మగ్లింగ్ అనే నేపథ్యం మాత్రమే ఈ తరానికి కొత్తగా అనిపిస్తుంది. మొత్తంగా పుష్పరాజ్ కు మన్యంపులికీ మధ్య కొన్ని పోలీకలున్నాయన్నమాట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • kriti shetty
  • mayanpulli
  • mohanlal
  • pushpa movie
  • sai pallavi

Related News

    Latest News

    • Amaravati TTD Temple : కృష్ణమ్మకు నిత్య హారతి.. కళ్లు చెదిరేలా టీటీడీ ఆలయం.. సీఎం చంద్రబాబు ప్లాన్‌ ఇదే!

    • Maoist Sensational Letter: జనవరి 1న అందరం లొంగిపోతాం – మావోయిస్టు పార్టీ

    • Dwaraka Tirumala : ద్వారకాతిరుమలలో అంతరాలయ దర్శనానికి టికెట్

    • Orientia Tsutsugamushi : ఏపీ ప్రజలను వణికిస్తున్న ప్రమాదకర పురుగు..ఇది కుడితే అంతే సంగతి !!

    • IND vs SA : మీరు ఉన్నప్పుడే కదా వైట్‌వాష్ ..అశ్విన్‌కు సునీల్ గవాస్కర్ అదిరిపోయే కౌంటర్!

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd