Prabhas Unstoppable: ఏం చెబుతున్నావ్ డార్లింగ్.. బాలయ్యతో బాహుబలి సందడి!
బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ప్రభాస్ (Prabhas) కనిపించబోతున్న విషయం తెలిసిందే.
- Author : Balu J
Date : 14-12-2022 - 11:43 IST
Published By : Hashtagu Telugu Desk
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ (Tollywood), బాలీవుడ్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న నటులలో ఒకరు. ప్రభాస్ చాలా సైలంట్. రియాల్టీ షోలలో చాలా అరుదుగా కనిపిస్తాడు. 2018లో బాహుబలి టీమ్ రాజమౌళి, రానా దగ్గుబాటితో కలిసి ప్రభాస్ (Prabhas) ‘కాఫీ విత్ కరణ్ షో’ లో కనిపించాడు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత.. ప్రభాస్ ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’లో షో లో కనిపించబోతున్నాడు.
ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్‌తో ఎన్‌బికెతో అన్‌స్టాపబుల్ (Unstoppable) గ్రేస్ చేయబోతున్నాడు. ఇప్పటికే మేకర్స్ ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశారు. ఈ కార్యక్రమం ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. బాలయ్య (Balakrishna), ప్రభాస్ లను ఒకే వేదిక మీద కనిపించబోతుండటంతో ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. అయితే ఈ ప్రోమోకు సంబంధించిన ఓ గ్లింప్స్ ను వదిలారు మేకర్స్. దీంతో ఈ షో పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.
గోపీచంద్ తో కలిసి ప్రభాస్ ఫుల్ సందడి చేశాడు. ‘‘ఏం చెబుతున్నావ్ డార్లింగ్’’ అంటూ హంగామా చేశారు. మద్రాస్ బటన్ షర్ట్ (పసుపు/నీలం మల్టీ కలర్)లో ప్రభాస్ (Prabhas) చాలా అందంగా కనిపిచాడు. ఇక ప్రభాస్ చొక్కా ధర అందర్నీ ఆకర్షిస్తోంది. ఆయన షర్ట్ కాస్ట్ రూ. 11,618.09గా అని తెలుస్తోంది. కెరీర్ పరంగా ప్రభాస్ (Prabhas) తదుపరి చిత్రం సాలార్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. సాలార్ 2023లో విడుదల కానుంది.
Also Read: Laatti Trailer: విశాల్ పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’ ట్రైలర్ చూశారా
Darlings…
Here's the most awaited and anticipated glimpse from #UnstoppableWithNBKS2🤩🤩🤩. Idhi chinna glimpse matrame. Main promo thvaralo…🔥#NBKWithPrabhas#NandamuriBalakrishna#Prabhas@YoursGopichand pic.twitter.com/mi48GDygFc— ahavideoin (@ahavideoIN) December 13, 2022