Naga Chaitanya 2nd Marriage : చైతు సెకండ్ స్టెప్ వేసాడు..మరి సామ్ ఎప్పుడో..?
- By Sudheer Published Date - 02:17 PM, Thu - 8 August 24

చిత్రసీమ(Film Industry )లో పెళ్లి , విడాకులు అనేవి చాల కామన్..ఎంత త్వరగా ప్రేమలో పడతారో..అంతే త్వరగా విడిపోతారు. షూటింగ్ సమయాల్లో దగ్గరవ్వడం..ఆ సాన్నిహిత్యం కాస్త ప్రేమకు దారి తీయడం..ఆ తర్వాత పెళ్లి..కొద్దీ నెలలకే మనస్పర్థలు రావడం..కోర్ట్ ద్వారా విడాకులు తీసుకోవడం..నెక్స్ట్ మరో పెళ్లి కి సిద్ధం అవ్వడం ఇలాంటివి ఎన్నో జరిగాయి…జరుగుతూనే ఉంటాయి. దీనిని ఎవ్వరు మార్చలేరు. కేవలం చిత్రసీమలోనే కాదు బయట కూడా అలాగే జరుగుతుంది. కాకపోతే బయట జనాలు ఇలాంటి పెళ్లిళ్లు ఎన్ని చేసుకున్న పెద్ద పట్టించుకోరు కానీ చిత్రసీమ నటీనటులు ప్రేమలో పడిన, పెళ్లి పీటలు ఎక్కినా, కడుపు తెచ్చుకున్న , కడుపు తీపించుకున్న, బిడ్డల్ని కన్నా ఆఖరికి విడిపోయి మరో పెళ్లి చేసుకున్న ఇలా ఏది జరిగిన కానీ మీడియా లో హైలైట్ అవ్వాల్సిందే..హైలైట్ చేయాల్సిందే. ఇప్పుడు అక్కినేని (Akkineni Family) వారింట పెళ్లి సందడి కూడా అలాగే హైలైట్ అవుతుంది. నాగార్జున (Nagarjuna) రెండో పెళ్లి చేసుకొని సెట్ కాగా..ఇప్పుడు చైతు (Naga Chaitanya) కూడా తండ్రి బాటలో నడుస్తున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఏమాయ చేసావే (Yemaya Chesave) చిత్రంతో సమంత (Samantha) మాయలో పడిన చైతు..కొంతకాలం వరకు రహస్య ప్రేమ కొనసాగించి..ఆ తర్వాత ఇరు పెద్దల సమక్షంలో పెళ్లి (Naga Chaitanya Samantha wedding) చేసుకున్నాడు. కానీ వీరి వివాహ బంధం ఎంతోకాలం సాగలేదు. పెళ్లైన కొంతకాలానికే మనస్పర్థలు రావడం తో కోర్ట్ ద్వారా విడాకులు తీసుకొని ఎవరి..దారి వారు చూసుకున్నారు. విడాకుల తర్వాత చైతు సినిమాల తో బిజీ గా ఉన్నప్పటికీ..సమంత మాత్రం ఓ ప్రాణాంతక వ్యాధి బారిన పడి చావు అంచుల వరకు వెళ్లి దేవుడి దయ తో క్షేమంగా బయటపడింది. ప్రస్తుతం ఆరోగ్యం ఫై శ్రద్ద పెట్టి సినిమాలకు దూరమైంది. ఇక చైతు మాత్రం సమంత తో విడాకుల అనంతరం నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) ప్రేమలో పడ్డాడు.
వీళ్లిద్దరూ తరచూ జంటగా కనిపించడంతో ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ చైతూ కానీ శోభిత కానీ ఎప్పుడూ ఈ విషయంపై నోరు విప్పలేదు. తమ పర్సనల్ లైఫ్ తమకుందని, వ్యక్తిగత విషయాల్లో తమకు ప్రైవసీ కావాలంటూ జవాబు దాటవేసేవారు. అయితే ఎట్టకేలకు ఈరోజు ఇద్దరూ సంప్రదాయబద్ధంగా ఒకటయ్యారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు ఉదయం 9 గంట 42 నిమిషాలకు నిశ్చితార్థం జరుపుకున్నారు. తమ కుటుంబంలోకి శోభితను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామంటూ నాగార్జున ట్వీట్ చేసి చైతు రెండో పెళ్లి గురించి అధికారిక ప్రకటన చేసాడు. ఈ మేరకు చైతన్య, శోభిత నిశ్చితార్థం ఫొటోలను ఎక్స్ లో పంచుకున్న నాగార్జున వారిద్దరు జీవితాంతం ప్రేమగా, సంతోషంగా కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరి సమంత ఎప్పుడు రెండో పెళ్లి చేసుకుంటుందని అభిమానులంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చైతు హ్యాపీగా రెండో స్టెప్ వేసాడు..నువ్వు కూడా రెండో స్టెప్ వేసేయి అంటూ అభిమానులు సలహా ఇస్తున్నారు.
Read Also : Foldable Smartphones: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూసున్నారా..? ఇదే మంచి అవకాశం..!