NTR : ఎన్టీఆర్ ధరించిన కొత్త వాచ్ ధర అన్ని కోట్లా..!
వార్ 2 షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఇటీవలే ముంబై చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్లిన ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ని గమనించారా..? దాని ధర ఎంతంటే..?
- Author : News Desk
Date : 15-04-2024 - 10:51 IST
Published By : Hashtagu Telugu Desk
NTR : మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసి ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తూనే.. సూపర్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. YRF స్పై సినిమాటిక్ యూనివర్స్ లో మరో హీరోగా ఎన్టీఆర్ పరిచయం కాబోతున్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎన్టీఆర్ ఇవ్వబోతున్నారు. ఆ తరువాత ఆ పాత్రతోనే ఒక ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ మూవీ చేయనున్నారు.
ఇక వార్ 2 షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఇటీవలే ముంబై చేరుకున్నారు. అక్కడ ఎయిర్ పోర్ట్ వద్ద మీడియా వాళ్ళకి ఎన్టీఆర్ ఫోటోలు ఇస్తూ రాయల్ గా కనిపించారు. ఇక ఆ సమయంలోనే బాలీవుడ్ ప్రేక్షకులను ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ఆకర్షించింది. దీంతో ఆ వాచ్ ఏ మోడల్..? దాని ధర ఎంత..? అని నెట్టింట వెతకడం మొదలు పెట్టారు. ఫైనల్లీ ఆ మోడల్ అండ్ కాస్ట్ కనుక్కున్నారు.
ఆ వాచ్ మోడల్ ‘Richard Mille Mclaren Speedtail’. ఈ మోడల్ వాచ్ చాలా తక్కువగా దొరుకుంటుంటాయట. ఇక దీని ధర వచ్చి అక్షరాలా రూ.7.5 కోట్లు. ఇది తెలుసుకొని బాలీవుడ్ ఆడియన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం.. ఇదంతా మాకు చాలా మాములు విషయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే, ఎన్టీఆర్ కి వాచ్స్ అంటే చాలా ఇష్టమని, ఇప్పటికే చాలా కాస్ట్లీ వాచ్స్ ఎన్టీఆర్ కలెక్షన్స్ లో ఉన్నాయని ఫ్యాన్స్ కి తెలుసు కాబట్టి.
ఇటీవల ‘టిల్లు స్క్వేర్’ ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ ఒక కొత్త వాచ్ ని ధరించి వచ్చారు. ఆ వాచ్ మోడల్ ‘Audemars Piguet Royal Oak Offshore’. ఇక దాని ధర రూ.16,232,657. ఇలా బయట కనిపించిన ప్రతిసారి ఒక కొత్త వాచ్ తో కనిపిస్తూ ఆడియన్స్ కి ఆకర్షిస్తున్నారు ఎన్టీఆర్.
Also read : Meenakshi Chaudhary : గురూజీ గుర్తించాక ఆఫర్లు తన్నుకుంటూ రావాల్సిందే.. ఏకంగా వెంకటేష్ సరసన ఛాన్స్..!