HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Waltair Veerayya Will Streaming On Ott This Date

Waltair Veerayya OTT: ఓటీటీలోకి వాల్తేరు వీరయ్య.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వాల్తేరు వీరయ్య సినిమాను థియేటర్ లో చూడలేకపోయిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది చిత్రబృందం.

  • Author : Balu J Date : 07-02-2023 - 4:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Waltair Veerayya
Waltair Veerayya

సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య కలెక్షన్ల మోత మోగించింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండడంతో.. మాస్ ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. చాలా మంది ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. మౌత్ టాక్ తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ ప్రభంజనం సృష్టించింది. అయితే మాస్ మాహారాజ్ రవితేజ మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది.

వాల్తేరు వీరయ్య సినిమాను థియేటర్ లో చూడలేకపోయిన ప్రేక్షకులతో పాటు మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది చిత్రబృందం. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఫిబ్రవరి 27వ తేదీన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందు కోసమే ప్రత్యేకంగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. చిరంజీవి సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ప్లస్ అయింది. ఇక చిరంజీవి మాస్ పెర్ఫార్మెన్స్ తో పాటు కామెడీ డ్యాన్సులు అభిమానులను ఉర్రూతలూగించాయి. చాలా కాలం తర్వాత చిరు.. యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపించారంటూ చాలా మంది ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ ను అలా చూపించినందుకు డైరెక్టర్ కు చాలా మంది ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు.

ఊర్వశీ రౌతేలా బాస్ పార్టీ అనే స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో కలిసి స్టెప్పులేసింది. ప్రకాష్ రాజ్ బాబీ సింహ విలన్లుగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య తర్వాత భోళా శంకర్ అనే మరో సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఆ చిత్రానికి సంగీతం అందించబోతున్నట్లు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • latest tollywood news
  • OTT deal
  • Waltair Veerayya

Related News

Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

Aapadbandhavudu Dance నటి మీనాక్షి శేషాద్రి 34 ఏళ్ల క్రితం ‘ఆపద్బాంధవుడు’ సినిమాలో తాను చేసిన క్లాసికల్ డ్యాన్స్‌ను మళ్ళీ రీక్రియేట్ చేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. 1992లో చిరంజీవి సరసన నటించిన ఈ చిత్రంలోని “అవురా అమ్మక చెల్లా” అనే పాటకు ఆమె 62 ఏళ్ల వయసులోనూ అదే గ్రేస్‌తో చిందేశారు. అమెరికాలోని తన డ్యాన్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఆమె చేసిన ఈ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వ

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd