HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Cinema
  • ⁄Waltair Veerayya Will Streaming On Ott This Date

Waltair Veerayya OTT: ఓటీటీలోకి వాల్తేరు వీరయ్య.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వాల్తేరు వీరయ్య సినిమాను థియేటర్ లో చూడలేకపోయిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది చిత్రబృందం.

  • By Balu J Published Date - 04:07 PM, Tue - 7 February 23
Waltair Veerayya OTT: ఓటీటీలోకి వాల్తేరు వీరయ్య.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య కలెక్షన్ల మోత మోగించింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండడంతో.. మాస్ ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. చాలా మంది ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. మౌత్ టాక్ తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ ప్రభంజనం సృష్టించింది. అయితే మాస్ మాహారాజ్ రవితేజ మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది.

వాల్తేరు వీరయ్య సినిమాను థియేటర్ లో చూడలేకపోయిన ప్రేక్షకులతో పాటు మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది చిత్రబృందం. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఫిబ్రవరి 27వ తేదీన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందు కోసమే ప్రత్యేకంగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. చిరంజీవి సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ప్లస్ అయింది. ఇక చిరంజీవి మాస్ పెర్ఫార్మెన్స్ తో పాటు కామెడీ డ్యాన్సులు అభిమానులను ఉర్రూతలూగించాయి. చాలా కాలం తర్వాత చిరు.. యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపించారంటూ చాలా మంది ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ ను అలా చూపించినందుకు డైరెక్టర్ కు చాలా మంది ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు.

ఊర్వశీ రౌతేలా బాస్ పార్టీ అనే స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో కలిసి స్టెప్పులేసింది. ప్రకాష్ రాజ్ బాబీ సింహ విలన్లుగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య తర్వాత భోళా శంకర్ అనే మరో సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఆ చిత్రానికి సంగీతం అందించబోతున్నట్లు సమాచారం.

Telegram Channel

Tags  

  • chiranjeevi
  • latest tollywood news
  • OTT deal
  • Waltair Veerayya
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Samantha: మళ్లీ ప్రేమలో పడొచ్చు కదా అంటూ సమంతకు సలహా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన బ్యూటీ?

Samantha: మళ్లీ ప్రేమలో పడొచ్చు కదా అంటూ సమంతకు సలహా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన బ్యూటీ?

ఎవరి సపోర్ట్ లేకుండా సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోతుంది సమంత.

  • Niharika No Clarity: ఇన్ స్టాలోకి నిహారిక రీఎంట్రీ.. డివోర్స్ పై సైలంట్!

    Niharika No Clarity: ఇన్ స్టాలోకి నిహారిక రీఎంట్రీ.. డివోర్స్ పై సైలంట్!

  • Chiru Loves Charan: “ప్రౌడ్ ఆఫ్ యు నాన్నా.. హ్యాపీ బర్త్ డే!

    Chiru Loves Charan: “ప్రౌడ్ ఆఫ్ యు నాన్నా.. హ్యాపీ బర్త్ డే!

  • Malla Reddy With Pawan: టాలీవుడ్ మెచ్చిన ‘విలన్’ మల్లారెడ్డి

    Malla Reddy With Pawan: టాలీవుడ్ మెచ్చిన ‘విలన్’ మల్లారెడ్డి

  • Ram Charan Game Changer: రామ్ చరణ్-శంకర్ మూవీ టైటిల్ ఇదే!

    Ram Charan Game Changer: రామ్ చరణ్-శంకర్ మూవీ టైటిల్ ఇదే!

Latest News

  • Nitish Rana: కోల్‌కతా కెప్టెన్‌గా నితీష్ రాణా..!

  • Tulasi Leaves: రోజు ఖాళీ కడుపుతో తులసి 4ఆకులను తింటే ఏం జరుగుతుందో తెలుసా?

  • Vastu Tips : నిమ్మకాయతో ఇలా చేస్తే అప్పుల బాధ తీరిపోయి, లక్ష్మీదేవి నట్టింట్లో తిష్ట వేయడం ఖాయం..

  • Bus accident in Saudi Arabia : సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం…మంటలు చెలరేగి 20 మంది మృతి.

  • Lord Hanuman : మంగళవారం హనుమంతుడి గురించి ఈ కథ తెలుసుకుంటే దరిద్రం పోయి…కోటీశ్వరులు అవుతారు..

Trending

    • World Trip in Bus: బస్సులో ప్రపంచ యాత్ర మీకు తెలుసా.. 22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు

    • Shocking News: సగం ధరకు పడిపోయిన ట్విట్టర్ విలువ

    • Virat Kohli: 9వ తరగతి ఎక్సామ్ లో విరాట్ కోహ్లీపై ప్రశ్న.. వైరల్ వైరల్

    • Bank Holidays in April 2023: ఏప్రిల్ లో 15 రోజులు బ్యాంక్ సెలవులు.. ఎప్పుడెప్పుడు అంటే..!

    • Tejashwi Yadav : తండ్రైన బీహార డిప్యూటీ సీఎం..ఫొటో షేర్ చేసిన తేజస్వీ యాదవ్

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: