Baby bump: కాజల్ తల్లి కాబోతున్న వేళ..! పిక్ వైరల్!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గత కొంతకాలంగా ఎలాంటి సినిమాలకు సైన్ చేయకపోవడంతో ఆమె ప్రెగ్నెన్సీ పై రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం కాజల్ గర్భవతి అని?
- Author : Balu J
Date : 20-12-2021 - 12:42 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గత కొంతకాలంగా ఎలాంటి సినిమాలకు సైన్ చేయకపోవడంతో ఆమె ప్రెగ్నెన్సీ పై రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం కాజల్ గర్భవతి అని? అందుకే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు? అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. పుకార్లకు చెక్ పెడుతూ కాజల్ లెటెస్ట్ ఫొటో ఒకటి షేర్ చేసింది. ఈ పిక్ లో ఆమె గర్భంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి కాజల్ తాను ప్రెగ్నెనెంట్ అని ఫొటో ద్వారా చెప్పకనే చెప్పింది. కాజల్ తన స్నేహితులు, వాళ్ల పిల్లలతో పోజులిచ్చిన ఫొటోల్లో బేబీ బంప్ కనిపించింది.
కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో తన మొదటి బిడ్డను ఆశిస్తున్నారు. అయితే దీనిపై ఈ జంట ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కాజల్ అగర్వాల్ కిచ్లూ ప్రెగ్నెన్సీ పుకార్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ పుకార్లపై కాజల్ సరైన సమయంలో మాట్లాడతానని చెప్పింది. కాజల్ అగర్వాల్ చిరంజీవి నటించిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ఫిబ్రవరి 4, 2022న థియేటర్లలో విడుదల కానుంది.
కాజల్ చేతిలో దుల్కర్ సల్మాన్, అదితి రావ్ హైదరీ నటించిన హే సినామిక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ డిసెంబర్ 21న విడుదల కానుంది. కాజల్ ఖాతాలో మరో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ప్రెగ్నెంట్ గా ఉండటంతో నిర్మాతలు రిప్లేస్ చేసినట్టు సమాచారం.
Wait, is that Kajal Aggarwal's baby bump in these latest PHOTOS?#KajalAggarwal https://t.co/ssnQbAfEcc
— Pinkvilla South (@PinkvillaSouth) December 19, 2021