Bigg Boss VJ Sunny : పేరుకే 50 లక్షలు.. చేతికి వచ్చేది సగమే.. బిగ్ బాస్ ప్రైజ్ మనీ పై సన్నీ హాట్ కామెంట్స్..!
Bigg Boss VJ Sunny బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన వీజే సన్నీ ఆ సీజన్ సక్సెస్ అవడానికి తన వంతు కృషి చేశాడు. సీజన్ 5 లో తన ఆటతో బిగ్ బాస్
- By Ramesh Published Date - 11:47 AM, Sat - 18 November 23

Bigg Boss VJ Sunny బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన వీజే సన్నీ ఆ సీజన్ సక్సెస్ అవడానికి తన వంతు కృషి చేశాడు. సీజన్ 5 లో తన ఆటతో బిగ్ బాస్ ఆడియన్స్ ని మెప్పించిన సన్నీ ఆ క్రేజ్ తో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ అంటూ ఒక సినిమాతో వచ్చిన సన్నీ లేటెస్ట్ గా సౌండ్ పార్టీ అంటూ మరో ప్రాజెక్ట్ తో వస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీజే సన్నీ బిగ్ బాస్ విశేషాలను కూడా ప్రేక్షకులతో పంచుకున్నారు.
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా 50 లక్షలు గెలుచుకున్న సన్నీ తన చేతికి సంగం కన్నా తక్కువ పైసలు వచ్చాయని అన్నారు. బిగ్ బాస్ ప్రైజ్ మనీ చెప్పుకోడానికే 50 లక్షలు అని కటింగ్స్ పోతే అందులో వచ్చేది సగమే అని అన్నారు. తనకు బిగ్ బాస్ నుంచి 50 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించగా అందులో వచ్చింది కేవలం 23 లక్షలు మాత్రమే అని 27 లక్షలు జి.ఎస్.టిలోనే పోయాయని అన్నారు.
ప్రైజ్ మనీ కోసమే కాదని ఆ టైటిల్ విజేతగా ప్రేక్షకుల్లో తనకు ఒక మైలేజ్ వచ్చిందని. ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టి తన ఆట గురించి మాట్లాడుతారని సన్నీ చెప్పారు. అందుకే బిగ్ బాస్ కి అందరు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారని అన్నారు. ఇక ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారని అడిగితే.. అది తను చెప్పలేనని.. ఎవరైతే ప్రేక్షకుల మనసులు గెలుస్తారో వారు గెలిచే అవకాశం ఉందని అన్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 లో అందరు బాగా ఆట ఆడుతున్నారని. అందరు తమ బెస్ట్ ఇస్తున్నారని అన్నారు. బిగ్ బాస్ 7 లో ఇప్పటివరకు ఉన్న వారిలో శివాజి, అమర్, పల్లవి ప్రశాంత్, యావర్, అర్జున్ అందరు తమ ఆటతో మెప్పిస్తున్నారని అన్నారు వీజే సన్నీ.
Also Read : Sai Pallavi: రామ్ చరణ్ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవి..?
We’re now on WhatsApp : Click to Join