Kashmir Files : మరో మైలురాయికి చేరువలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’..!
- By Hashtag U Published Date - 03:25 PM, Tue - 29 March 22
ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై, బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుండే ఈ మూవీ అటు మీడియాలోనూ, ఇటు ట్రేడ్‌లోనూ విపరీతమైన ఆదరణ పొందింది. కాశ్మీరీ పండిట్ల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రూ. 234 కోట్ల మార్క్‌ను దాటి, రూ.250 కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు తీస్తోంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైన ఫీట్ అనే చెప్పాలి. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ పై కాస్త ప్రభావం పడింది అని తెలుస్తోంది. ఈ చిత్రం ఆదివారం రోజున రూ.3.5 కోట్లు వసూలు చేసింది. లాంగ్ రన్ లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఈజీగా రూ. 300 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోవైపు కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా బాలీవుడ్ కాస్త, వివేక్ వుడ్ గా మారిందని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ నిజం అన్నట్టుగానే కనిపిస్తోంది.
Related News
Vaccine War: ది వ్యాక్సిన్ వార్ పై సీఎం యోగి కామెంట్స్
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది వ్యాక్సిన్ వార్' చిత్రాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. ది కాశ్మీర్ ఫైల్స్ తర్వాత వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన చిత్రం