VishwakSen : ఆహాలో మాస్ కా దాస్.. ఫ్యామిలీ ధమాకా.. యాంకర్ గా మారనున్న హీరో..
త్వరలో విశ్వక్ సేన్ యాంకర్ గా ఆహా ఓటీటీలో సరికొత్త షో రాబోతుంది. 'ఫ్యామిలీ ధమాకా'(Family Dhamaka) అనే సరికొత్త షోని ఆహా అనౌన్స్ చేసింది.
- By News Desk Published Date - 10:00 PM, Tue - 15 August 23
యువ హీరో విశ్వక్ సేన్(VishwakSen) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే దాస్ కా ధమ్కీ(Das Ka Dhamki) సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఇప్పుడు విశ్వక్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంత బిజీగా ఉండి కూడా యాంకర్ గా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నాడు. తెలుగు వారి కోసం వచ్చిన ఓటీటీ ఆహా(Aha) మొదటి నుంచి కూడా కొత్త కొత్త షోలు, సినిమాలు, సిరీస్ లతో మెప్పిస్తునే ఉంది.
త్వరలో విశ్వక్ సేన్ యాంకర్ గా ఆహా ఓటీటీలో సరికొత్త షో రాబోతుంది. ‘ఫ్యామిలీ ధమాకా'(Family Dhamaka) అనే సరికొత్త షోని ఆహా అనౌన్స్ చేసింది. విశ్వక్ యాంకర్ గా పలు ఫ్యామిలీలతో ఒక గేమ్ షో లాంటిది ప్లాన్ చేశారు. మాస్ కా దాస్ ఆడించే ఫ్యామిలీ ఆట చూడండి అంటూ ఆహా ఈ షో గురించి నేడు ప్రకటించింది.
ఇప్పటికే ఫ్యామిలీ ధమాకా కొన్ని ఎపిసోడ్స్ కూడా షూట్ అయిపోయినట్టు సమాచారం. త్వరలోనే ఆహా ఓటీటీలో వీక్లి ఎపిసోడ్స్ కింద ఈ షో వచ్చే అవకాశం ఉంది. ఓ పక్క హీరోగా, డైరెక్టర్ గా మెప్పిస్తున్న విశ్వక్ ఇప్పుడు యాంకర్ గా ఎలా మెప్పిస్తాడా చూడాలి.
ika chustharuga….
'ఫ్యామిలీ ధమాకా' మాస్ కా దాస్ ఇలాకా!!
Ee maas ka Dass aadinche Family aata..!👨👩👦👦🙅🏻♂️👨👨👧👦
Coming soon on aha👉 #FamilyDhamakaOnAHA Coming Soon! @VishwakSenActor @rsbrothersindia @KhiladiOfficia3 @sprite_india @lalithaajewels @fremantle_india pic.twitter.com/PiccvEEX8Y— ahavideoin (@ahavideoIN) August 15, 2023
Also Read : Rana Daggubati : బాలీవుడ్ హీరోయిన్‌కి సారీ చెప్పిన రానా.. మొన్నేమో అలా అనేసి..
Related News
Kajal: ఓటీటీలోకి వచ్చేస్తున్న కాజల్ మూవీ.. రేపట్నుంచే స్ట్రీమింగ్
Kajal: కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో జనని అయ్యర్, కలయరసన్, రైజా విల్సన్, పార్వతి తిరువోతు ఇతర పాత్రల్లో దీకే రైటర్ గా డైరెక్టర్ గా పదార్తి పద్మజ నిర్మాతగా వస్తున్న సినిమా కాజల్ కార్తిక. థ్రిల్లింగ్ హర్రర్ కాన్సెప్ట్ గా వస్తున్న ఈ సినిమా లో కాజల్ హారర్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. విగ్నేష్ వాసు డి ఓ పి వర్క్ మరియు ప్రసాద్. ఎస్. ఎన్. మ్యూజిక్ ఈ సినిమాకి ప్రత�