Vijay Sethupati Maharaja : అక్కడ 40000 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమా..!
Vijay Sethupati Maharaja విజయ్ సేతుపతి 50వ సినిమాగా సూపర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా టీజర్, ట్రైలర్ చూసి ఈ సినిమాలో ఇంత డెప్త్ ఉంటుందని ఎవరు గెస్ చేయరు. సినిమా చూసిన ఆడియన్స్ కు
- By Ramesh Published Date - 07:33 AM, Thu - 21 November 24

విజయ్ సేతుపతి నిధిలన్ స్వామినాథన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా మహారాజ. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా సూపర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా టీజర్, ట్రైలర్ చూసి ఈ సినిమాలో ఇంత డెప్త్ ఉంటుందని ఎవరు గెస్ చేయరు. సినిమా చూసిన ఆడియన్స్ కు మాత్రం ఫ్యూజులు అవుట్ అయ్యేలా ట్విస్ట్ ఇస్తారు.
ఇక విజయ్ సేతుపతి (Vijay Sethupathi) యాక్టింగ్ డైరెక్టర్ స్క్రీన్ ప్లే సినిమాను ది బెస్ట్ గా నిలిచేలా చేశాయి. ఆల్రెడీ థియేట్రికల్ రిలీజై సూపర్ హిట్ అయిన మహారాజ మూవీ ఓటీటీలో కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాను చైనాలో భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. చైనా (China)లో మాహారాజా (Maharaja) సినిమాను ఏకంగా 40000 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారట.
ఓటీటీలోకి కూడా వచ్చేసిన..
ఒక తమిళ సినిమా అది కూడా థియేట్రికల్ రన్ పూర్తై ఓటీటీలోకి కూడా వచ్చేసిన సినిమాను చైనాలో భారీ స్థాయిలో రిలీజ్ చేయడం చాలా గొప్ప విషయమని చెప్పొచ్చు. ఓ విధంగా ఏ సినిమాకు ఇన్ని వేల థియేటర్స్ దొరకలేదని చెప్పొచ్చు.
కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా తన సత్తా చాటుతూ వస్తున్న విజయ్ సేతుపతి లీడ్ రోల్ సినిమాలు చేస్తూనే మరోపక్క విలన్ గా కూడా మెప్పిస్తున్నాడు. విజయ్ మాహారాజ సిన్మా తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
Also Read : Pushpa 2 : చెన్నైలో పుష్ప 2 ఈవెంట్.. ఈసారి తమిళ గడ్డపై పుష్ప రాజ్ హంగామా..!