Vijay Sethupathi Looks: వాట్ ఏ డెడికేషన్.. స్లిమ్ లుక్ లో విజయ్ సేతుపతి, ఫ్యాన్స్ ఫిదా!
హీరో విజయ్ సేతుపతి డిఫరెంట్ లుక్ లో కనిపించి షాకిచ్చాడు.
- By Balu J Published Date - 04:31 PM, Tue - 13 December 22

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) డిఫరెంట్ క్యారెక్టర్స్ కు కేరాఫ్ అడ్రస్. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ నటుడు తాను పోషించే పాత్రల విషయంలో ఏమాత్రం రాజీపడడు. ‘కెఆర్‌కె’ వంటి సరదా చిత్రాలే కాకుండా, మాస్టర్, ఉప్పెన లాంటి సినిమాల్లో బలమైన పాత్రల్లో ఈజీగా నటించాడు. తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా ప్యాన్ ఇండియా నటుడుగా పేరొందాడు. తెలుగులో ‘ఉప్పెన’, సైరా’, మలయాళంలో ’19(1)(ఎ)’ మరియు హిందీలో కూడా రెండు సినిమాలు చేశాడు.
బ్లాక్ బస్టర్ చిత్రం ‘విక్రమ్’లో విలన్ పాత్ర పోషించిన ఆయన, ఆ పాత్ర కోసం చాలా బరువు పెరిగిన విషయం తెలిసిందే. కరడు గట్టిన విలన్ గా భయపెట్టించాడు. లోకల్ గ్యాంగ్ స్టర్ గా పర్ఫెక్ట్ గా నటించాడు. ఆయన గత చిత్రం ‘డీఎస్పీ’ ఫ్లాప్ అయినప్పటికీ విజయ్ (Vijay Sethupathi) చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. సేతుపతి ప్రస్తుతం స్లిమ్ లుక్ (Slim Look) లో, మిర్రర్ సెల్ఫీని షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తెల్లటి చొక్కాలో అందంగా, కళ్ళజోడుతో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఏ సినిమా స్లిమ్‌గా మార్చేసింది అని ఫ్యాన్స్ (Fans) ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సందీప్ కిషన్ ‘మైఖేల్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కత్రినా కైఫ్‌తో కలిసి ‘మెర్రీ క్రిస్మస్’ అనే హిందీ చిత్రం చేస్తున్నాడు. వెట్రి మారన్ దర్శకత్వం వహించిన ‘విడుతలై’లో ఆయన కథానాయకుడు. ‘గాంధీ టాక్స్’ అనే మూకీ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. SRK, అట్లీల భారీ ప్రాజెక్ట్ ‘జవాన్’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు విజయ్. అంతే కాకుండా, హిందీ వెబ్ సిరీస్ అయిన ‘ఫర్జీ’లో అతను ప్రధాన కథానాయకులలో ఒకడు. ఇందులో షాహిద్ కపూర్, రాశి ఖన్నా కూడా నటిస్తున్నారు.
Also Read: RGV Bold Interview: వర్మ మరో బోల్డ్ ఇంటర్వ్యూ.. శ్రీదేవి తోడలు గుర్తు చేసుకున్న ఆర్జీవీ!