HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Deverakondas Liger Fandom Tour Warangal

LIGER Fandom Tour: వరంగల్ ఫ్యాన్‌ డమ్‌ టూర్ లో ‘లైగర్‌’

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్

  • Author : Balu J Date : 15-08-2022 - 6:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Liger
Liger

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదలౌతుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్ట్ 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ‘లైగర్‌’ ఫ్యాన్‌డమ్‌ టూర్ ని వరంగల్-హన్మకొండ కాజీపేటలోని సత్యసాయి కన్వెన్షన్‌లో గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర యూనిట్. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ , వరంగల్ ఎంపీ పసుమూరి దయాకర్, డిప్యూటీ మేయర్ రిజ్వాన్ షమన్ ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ వేడుకలో కోకా పాటకి విజయ్ దేవరకొండ, అనన్య పాండే వేదికపై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులుని ఆకట్టుకుంది.

ఈ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకులందరికీ నా ప్రేమ. ఇండియా అంతా తిరిగి ఇక్కడికి వచ్చాం. కానీ ఎక్కడ తిరుగుతున్నా ఇక్కడి గురించే ఆలోచన. లైగర్ గురించి ఇక్కడ ఏమనుకుంటున్నారనే ఆలోచన. వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో పెద్ద ఈవెంట్ చేయాలని అనుకున్నాం. వర్షం వలన కుదరలేదు. కానీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారి ప్రోత్సాహం వలన ఈ ఈవెంట్ ఇక్కడ ఇంత గ్రాండ్ గా జరిగింది. నేను ఇండియాలో ఎక్కడి వెళ్ళిన జనాలు అమితమైన ప్రేమని పంచారు. ఊహించని రీతిలో జనాలు వచ్చారు. అసలు ఇంత ప్రేమ ఎందుకు చుపిస్తున్నారో అర్దమయ్యేది కాదు. అయితే ఏం జరుగుతున్నా అది ఇక్కడే మొదలైయింది. మన కాలేజ్ లో , మన థియేటర్ లో మన ఆంధ్ర తెలంగాణలో ఇది మొదలైయింది. మీరు పంచిన ప్రేమని మర్చిపోలేను. ఆగస్ట్ 25న మీ ప్రేమని తిరిగివ్వాలి. ఆగస్ట్ 25 ఆగ్ లాగా దేంగే అని వరంగల్ లోనే చెప్పాను. సినిమాపై ఎలాంటి డౌట్ లేదు. సినిమా బ్లాక్ బస్టర్. తెలంగాణ , ఆంధ్ర షేక్ చేస్తే ఇండియా మొత్తం వినిపించాలి. లైగర్ లో అమ్మా కొడుకు కరీంనగర్ నుండి బయలుదేరి కొడుకుని ఛాంపియన్ చేయాలని ముంబై వెళ్తారు. పూరి మా నాన్న, ఛార్మీ మా అమ్మలాగ ఇండియాని షేక్ చేద్దామని ముంబై వెళ్లాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొట్టాలనే బయలుదేరాం. పూరి గారు రాసిన డైలాగ్ చెప్పాలంటే అదృష్టం వుండాలి. లైగర్ లో నాకు నచ్చిన డైలాగ్.. వి ఆర్ ఇండియన్స్.. పోదాం, కొట్లాడదాం.. ఆగ్ హే అందర్. దునియా కో ఆగ్ లగా దేంగే. సబ్ కి వాట్ లాగా దేంగే. ఆగస్ట్ 25న మనమందరం కలసి గట్టిగా కొట్టాలి. లైగర్ టీం అందరికీ థాంక్స్. ప్రేక్షకులందరికీ థాంక్స్. ఐ లవ్ యూ” అన్నారు.

పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. హాయ్ వరంగల్., వర్షం పడుతున్నా తడిచిమరీ ఈ వేడుకకి విచ్చేసిన ప్రేక్షకులు, అభిమానులందరికీ లవ్ యూ. ఆగస్ట్ 25 విడుదలౌతుంది. కరణ్ జోహార్ గారికి స్పెషల్ థాంక్స్. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. అపూర్వ మెహతా మిగతా టీం అందరికీ థాంక్స్. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారికి కృతజ్ఞతలు. ఒక రోజు మా ఆవిడ తట్టింది. ఎందుకంటే.. కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు మంచి మంచి సినిమాలు తీసుతున్నారు.. నువ్వు వెనకపడిపోతున్నావ్.. సందీప్ రెడ్డి వంగా అనే డైరెక్టర్ వచ్చాడు. అర్జున్ రెడ్డి అనే సినిమా తీశాడు. నేను నా కూతురు మూడు సార్లు చూశాం., నువ్వూ చూడు” అని చెప్పింది. అర్జున్ రెడ్డి చూశా. డైరెక్షన్ బావుంది.. సినిమా కూడా బాగానే వెళ్తుంది. కానీ 45 నిమిషాలు సినిమా చూసి ఆపేశా. కారణం.. సినిమాలో కుర్రాడిపై నా ద్రుష్టి ఆగిపోయింది. ఇంత నిజాయితీగా ఒక కుర్రాడు నటిస్తున్నాడని విజయ్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయా. అప్పుడే విజయ్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. విజయ్ లో నాకు నచ్చేది నిజాయితీ. లైగర్ లో ఎంత ఎలివేషన్ పెట్టినా కొంచెం పొగరు కూడా కనిపించదు. చాలా నిజాయితీగా చేశాడు. ఒక నిర్మాతగా విజయ్ కి కోటి రూపాయిలు ఇస్తే వద్దు ముందు సినిమా కోసం ఖర్చుపెట్టండని అంటాడు. తర్వాత రెండుకోట్లు పంపిస్తే.,,. మాకు అప్పులున్నాయని తెలిసి.. ముందు అప్పులు తీర్చమని తిరిగిపంపించేస్తాడు. ఈ రోజుల్లో ఇలా ఎవరంటారు ?! హ్యాట్సప్ టు విజయ్. విజయ్ నాన్నగారు మా అబ్బాయిని ఒక కొడుకులా చూసుకొని మంచి సినిమా తీయ్ అన్నారు. కానీ విజయ్ నన్ను ఒక తండ్రిలా చూసుకొని నా కష్టాల్లో నాతో పాటు నిల్చున్నాడు. విజయ్ లాంటి హీరోని నేను చూడలేదు. మైక్ టైసన్ ని పట్టుకోవడానికి ఏడాది పట్టింది. ఆయన్ని ఈ సినిమాలోకి తీసుకొచ్చిన క్రెడిట్ ఛార్మికి దక్కుతుంది.

మైక్ టైసన్ లాంటి లెజెండ్ తో కలసి పని చేసే అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఆయనతో సినిమా చేస్తామంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. అనన్య ఫైర్ బ్రాండ్. అద్భుతంగా నటిస్తుంది. రమ్యకృష్ణ గారు రెబల్ తల్లిగా కనిపిస్తారు. అమెది చాలా స్ఫూర్తిని ఇచ్చే పాత్ర. ఛార్మీ సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఏ కష్టాన్ని నా వరకూ తీసుకురానివ్వదు. సెట్ లో ఆమె ఏడ్చిన సందర్భాలు కూడా వున్నాయి. కానీ బయటికి చెప్పదు. ఛార్మీకి బిగ్ థాంక్స్. అలీతో చేసిన సినిమాలన్నీ హిట్టే. కష్టాల్లో సుఖాల్లో తోడుంటాడు. నాపై ప్రేమతో స్టేజ్ పై డ్యాన్స్ వేశాడు. రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే, చంకీ పాండే, గెటప్ శ్రీను, వంశీ అందరూ ప్రేమతో చేసిన సినిమా ఇది. అజీమ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. భాస్కర భట్ల మంచి లిరిక్స్ రాశారు. సాగర్ సౌత్ మ్యూజిక్ చూసుకున్నారు. విష్ నటుడిగా తెలుసు. అతను రియల్ ఫైటర్. ఈ సినిమాలో బ్యాడ్ గాయ్ రోల్ ప్లేయ్ చేశాడు. మా కంపనీ సీఈవో కూడా. విష్ మా బలం. డివోపీ విష్ణు శర్మ, ఎడిటర్ జునైద్, ఆర్ట్ డైరెక్టర్ జానీ, అనిల్.. మా పీఆర్వో వంశీ- శేఖర్, లీగర్, మార్కెటింగ్ టీమ్స్ ,శ్రేయాస్ మీడియా శ్రీనివాస్.. అందరికీ కృతజ్ఞతలు. లైగర్ ఆగస్ట్ 25 న వస్తోంది. ఇది ఫుల్లీ లోడెడ్ మసాలా మూవీ. సినిమాని మీరంతా థియేటర్ లో చూడాలి’ అని కోరారు.

అనన్య పాండే మాట్లాడుతూ… నా పేరు అనన్య పాండే. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా ఇష్టం. తెలుగు సినిమా కుటుంబం భాగం కావాలని కోరుకుంటున్నాను. ఆ అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. లైగర్ తో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. విజయ్ దేవరకొండ, పూరి గారు, మైక్ టైసన్ గారితో పని చేయడం చాలా ఆనందంగా వుంది. విజయ్ దేవరకొండ నా బుజ్జి కన్నా. ఆగస్ట్ 25న లైగర్ సినిమా థియేటర్ లో పగిలిపోద్ది. లైగర్ ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా. దింపుతున్నాం. మజా వస్తది” అన్నారు.

ఛార్మీ కౌర్ మాట్లాడుతూ.. ఐ లవ్ యూ వరంగల్. ఈవెంట్ చేయాలంటే నా ఫస్ట్ ఛాయిస్ వరంగల్. ఇక్కడ ఈవెంట్ జరిగితే సినిమా సూపర్ హిట్. చివరి క్షణంలో వేదిక మారింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు ఎంతో సహకారం అందించారు. లైగర్ గురించి చాలా మాట్లాడాలని వుంది. కానీ లైగర్ సక్సెస్ కొట్టి బిగ్ బాక్సాఫీసు నంబర్స్ క్రియేటి చేసిన తర్వాత అప్పుడు సక్సెస్ మీట్ లో మాట్లాడతాను. ఆగస్ట్ 25 వాట్ లాగా దేంగే” అన్నారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ananya Panday
  • liger movie
  • vijay devarakonda
  • warangal

Related News

Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్, జనసేన మధ్య నెలకొన్న వివాదం చల్లారడం లేదు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్, జనసేన నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. వాటికి కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నె

    Latest News

    • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd